Telangana

కేసీఆర్‌కు రాజకీయ వీఆర్ఎస్ తప్పదు… వచ్చే ఎన్నికల్లో బీజేపీదే విజయం – రాజగోపాల్ రెడ్డి

క్రైమ్ మిర్రర్, యదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి : బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పదని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో మట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయారని అన్నారు. కేసీఆర్ అసమర్థ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని చెప్పారు. అధికారం అడ్డం పెట్టుకొని వందమంది ఎమ్మెల్యేలతో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేయించి మునుగోడులో తనపై బీఆర్ఎస్ గెలిచిందన్నారు.

Read Also : అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం… హెల్త్ బులెటిన్‌లో ప్రకటించిన వైద్యులు

కానీ నైతిక విజయం మాత్రం బీజేపీదేనని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ వ్యాపారాల కోసం బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కయ్యారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లేనన్న భావన తెలంగాణ ప్రజల్లో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన కూడా నాయకత్వం లోపం కారణంగా బలహీనపడిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి0 వ్యాఖ్యనించటం ఆయన ఫైరయ్యారు. రేవంత్ కాస్త ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. ఎవరు ఎవరకి బీ టీమ్‌గా వ్యవహరిస్తున్నారో ప్రజలకు తెలుసునని అన్నారు. తెలంగాణాలో కేసీఆర్ నియంతలా ప్రవర్తిస్తున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు.

Also Read : ముందస్తు ఎన్నికలకు రెడీ… కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్

గణతంత్ర దినోత్సవం జరపకపోవటమంటే రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌తో పాటు రాజ్యాంగాన్ని అవమానించినట్లేనని అన్నారు. గవర్నర్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మాటలు.. ఆ పార్టీ తీరుకు అద్దం పడుతున్నాయన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో చెప్పేందుకు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అందుకే బీజేపీ వైపు చూస్తున్నారని వ్యాఖ్యనించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో తాము అధికారంలోకి రావటం తథ్యమని కోమటిరెడ్డి జోశ్యం చెప్పారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చుకున్న కేసీఆర్‌.. చివరికి వీఆర్ఎస్ తీసుకోవటం ఖాయమని ఎద్దేవా చేశారు.

ఇవి కూడా చదవండి : 

  1. ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి మృతి… సంతాపం తెలిపిన మంత్రి కేటీఆర్
  2. ఎమ్మెల్సీ కవితతో శరత్ కుమార్ భేటీ… బీఆర్ఎస్‌తో కలిసి పనిచేయనున్నట్లు ఉహాగానాలు
  3. తుక్కుగూడ మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో ఓట్ల గందరగోళం…
  4. తెలంగాణలో జీరో కొవిడ్ కేసులు… మూడేళ్ల తర్వాత తొలిసారి
  5. రధ సప్తమి వేళ తిరుమలకు పోటేత్తిన భక్త జనం… సప్త వాహనాలపై శ్రీవారి దర్శనం

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.