
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : విశాఖలోని కళ్యాణ మండపంలో పెళ్లి వేడుకను జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ముహూర్తం దగ్గర పడుతుంది. అతిథులు సందడిగా గడుపుతున్నారు. ఎవరి హడావుడి వారు చేస్తున్నారు. ఇంతలోనే అందరూ భయాందోళనకు గురయ్యారు. ఏమైందో తెలియదు కానీ.. ఒక్కసారిగా ఫ్లోర్ లోని టైల్స్ వాటంతట అవే పగిలిపోయాయి. దీంతో అందరూ బయటకు పరుగులు తీశారు. జిల్లా చినముషిడివాడకు చెందిన చిరంజీవి, మౌనికలకు పెళ్లి నిశ్చయమైంది.
Read Also : రధ సప్తమి వేళ తిరుమలకు పోటేత్తిన భక్త జనం… సప్త వాహనాలపై శ్రీవారి దర్శనం –
శుక్రవారం తెల్లవారుజామున 5.15 గంటలకు ముహుర్తం ఫిక్స్ చేశారు రెండు కుటుంబాల పెద్దలు. వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపేందుకు స్థానికంగా ఉన్న దాట్ల కల్యాణ మండపాన్ని బుక్ చేశారు. ముహూర్త సమయం దగ్గర పడుతుండగా బంధువులు, స్నేహితులు అందరూ కల్యాణ మండపానికి చేరుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో అందరూ భోజనాలు చేస్తుండగా.. ఫ్లోర్‌లోని టైల్స్ ఒక్కసారిగా పగిలిపోయి ఎగిరిపడ్డాయి. అసలు ఏం జరుగుతుందో అర్థంకాక భయందోళన చెందారు. ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారమిచ్చారు. ఫంక్షన్ హాల్ కు చేరుకున్న పోలీసులు.. లోపలికి వెళ్లి పరిశీలించారు.
Also Read : అభిమాని సెల్ ఫోన్ విసిరేసిన రణ్ బీర్ కపూర్.. వీడియో వైరల్ –
ఒక్క ఫస్ట్ ఫ్లోర్ లో మాత్రమే టైల్స్ పగిలిపోయాయని.. మిగిలిన మూడు ఫ్లోర్స్ మామూలుగానే ఉండటాన్ని గుర్తించారు. ఎందుకు ఇలా జరిగిందో ఎవరికీ అర్ధం కాలేదు. అనంతరం పెళ్లి వారి కోసం మరో కళ్యాణ మండపాన్ని మాట్లాడి వివాహం జరిపించారు. స్థానిక శారదాపీఠం పక్కనున్న పోర్టు కళ్యాణ మండపాన్ని 45 రోజుల కిందట బుక్ చేసినా.. ఇవ్వలేమని చెప్పారని వధువు సోదరి చెప్పారు. శారదాపీఠం వార్షికోత్సవాల్లో భాగంగా సీఎం జగన్, గవర్నర్ వస్తున్నారని.. సడెన్ గా ఫంక్షన్ హాల్ ఇవ్వలేమని చెప్పారన్నారు. దీంతో కళ్యాణ మండపం మార్చాల్సి వచ్చిందని.. చివరికి ఇలా జరిగిందని అన్నారు.
ఇవి కూడా చదవండి :
- ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి మృతి… సంతాపం తెలిపిన మంత్రి కేటీఆర్ –
- బ్యాంకులో తాకట్టుపెట్టిన బంగారం మాయం… కేసు నమోదు చేసిన పోలీసులు
- రమ్య నన్ను చంపాలని చూసింది- కోర్టును ఆశ్రయించిన నటుడు నరేశ్
- నా భార్య వల్లే నేను క్రమశిక్షణ నేర్చుకున్నా-రజనీకాంత్
- షర్మిల పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి…
2 Comments