
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : నటులను చూసినప్పుడు అభిమానులు అత్యుత్సాహం చూపిస్తుంటారు. అందులోనూ తమ అభిమాన హీరో అయితే సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. వచ్చిన ఛాన్స్ ను మిస్ చేసుకోకూడదనే ఆరాటంతో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా నటులను ఇబ్బందులు పెడుతుంటారు. ఈ సమయంలో అవతల ఉన్న నటులకు కోపం చెర్రెత్తుకు రావడం సహజమే. ఇక వారి రియాక్షన్ ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. ఇలాంటి అనుభవమే రణ్ బీర్ కపూర్ కు ఎదురైంది. తనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఓ అభిమాని ఫోన్ ను విసిరేశాడు ఈ కపూర్ హీరో.
Read Also : ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి మృతి… సంతాపం తెలిపిన మంత్రి కేటీఆర్ –
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ అభిమాని రణ్ బీర్ కపూర్ తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. రణ్ బీర్ కూడా నవ్వుతూ అభిమానితో సెల్ఫీకి ఫోజిచ్చాడు. అయితే ఆ అభిమాని చాలా సార్లు సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. దీంతో చిరాకుపడ్డ రణ్ బీర్ అతని సెల్ ఫోన్ ను లాక్కుని వెనక్కి విసిరేశాడు.ఈ వీడియోను బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. షాకింగ్ రణ్ బీర్ కపూర్ అభిమాని ఫోన్ విసిరేశాడు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. 16 సెకన్లు నిడివి గల ఈ వీడియో వెంటనే వైరల్ అయింది.
Read Also : బ్యాంకులో తాకట్టుపెట్టిన బంగారం మాయం… కేసు నమోదు చేసిన పోలీసులు
Also Read : రమ్య నన్ను చంపాలని చూసింది- కోర్టును ఆశ్రయించిన నటుడు నరేశ్
ఇవి కూడా చదవండి :
- నా భార్య వల్లే నేను క్రమశిక్షణ నేర్చుకున్నా-రజనీకాంత్
- వైశాలి కిడ్నాప్ కేసులో నవీన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన రంగారెడ్డి కోర్టు…..
- తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమం… బెంగుళూరుకు తరలించే అవకాశం
- గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి… పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
- షర్మిల పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి…