
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సినీ నటుడు నందమూరి తారకరత్న స్పృహ తప్పి పడిపోయాడు.లోకేష్ యువగళం పాదయాత్రలో తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు. తారకరత్నను హుటాహుటిన కుప్పం కేసీ ఆసుపత్రికి తరలించగా.. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుకున్న బాలకృష్ణ వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. తారకరత్న ఆస్పత్రికి వచ్చినప్పుడు పల్స్ లేదని వైద్యులు తెలిపారు. శరీరం నీలంగా మారిందని.. వెంటనే చికిత్స ప్రారంభించమన్నారు. తారకరత్న పల్స్ సాధారణ స్థితికి చేరుకునేందుకు 45 నిమిషాల సమయం పట్టిందని వైద్యులు తెలిపారు. తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతుందని భావిస్తున్నామని చెప్పారు.
Read Also : గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి… పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
తారకరత్నకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. కుప్పం సమీపంలోని వరదరాజ స్వామి ఆలయంలో పూజల తర్వాత మసీదులో ఆయన ప్రార్థనలను నిర్వహించారు. ఈ ప్రార్థనల్లో తారకరత్న కూడా పాల్గొన్నారు. అనంతరం మసీదు నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తల తాకిడి పెరిగింది. పాదయాత్రలో నడుస్తున్న సమయంలో తారకకత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి పీఈఎస్ ఆసుపత్రికి అటు నుంచి బెంగళూరుకు తరలించే అవకాశం ఉంది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితిని సమీక్షించారు.
ఇవి కూడా చదవండి :
-
షర్మిల పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి…
-
మహిళల్ని లైంగికంగా వేధిస్తున్నాడని టీడీపీ సర్పంచ్‌పై సొంత ఊరివాళ్లే పోస్టర్లు
-
లోకేశ్ పాదయాత్రకు సర్వం సిద్ధం… 200 మంది ప్రైవేటు భౌన్సర్లు, 400 మంది వాలంటీర్లు
-
నేడు బీఆర్ఎస్ లోకి మాజీ ముఖ్యమంత్రి….
-
ప్రారంభమైన దక్కన్ మాల్ కూల్చివేత పనులు… భారీ క్రేన్ల సహాయంతో కూల్చివేత
One Comment