
క్రైమ్ మిర్రర్, హైద్రాబాద్ ప్రతినిధి : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మన్నెగూడ డెంటల్ డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డికి ఊరట లభించింది. బెయిల్ కోసం నవీన్ రెడ్డి చేస్తున్న విశ్వప్రయత్నాలు ఫలించాయి. నవీన్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. నవీన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. అయితే.. నవీన్ రెడ్డికి బెయిల్ విషయమై వేసిన పిటిషన్ రంగారెడ్డి కోర్టులో రెండు రోజుల క్రితం విచారణ జరగ్గా.. పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. అయితే.. నవీన్ రెడ్డి అరెస్టయిన సమయంలోనే.. అతనికి సంబంధించిన వీడియోలు.. వైశాలి, నవీన్ కలిసి ఉన్న వీడియోలు బయటకు వచ్చి.. నానా హంగామా చేశాయి.
Read Also : తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమం… బెంగుళూరుకు తరలించే అవకాశం
అదీ కాక.. కిడ్నాప్ సమయంలో వైశాలిపై విచక్షణా రహితంగా దాడి చేసినట్టు పోలీసులు రిమాండ్‌లో నవీన్ రెడ్డే స్వయంగా ఒప్పుకున్నాడని బాధితుల తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి వివరించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. నవీన్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కాగా.. మళ్లీ ఈరోజు విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కానీ.. షరతులు వర్తిస్తాయని కండీషన్ పెట్టింది. తాను ప్రేమించిన వైశాలికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరుగుతుందనే విషయం తెలుసుకుని నవీన్ రెడ్డి సుమారు 100 మందితో వెళ్లి వైశాలిని ఆమె ఇంటి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. అడ్డొచ్చిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులపై దాడి చేశారు. వైశాలిని కారులో మిర్యాలగూడ వైపు తీసుకెళ్లగా.. కొన్ని గంటల్లోనే వైశాలి ఆచూకీ పోలీసులు కనుగొన్నారు.
Also Read : గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి… పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
ఆ తర్వాత గోవాలో నవీన్ రెడ్డి ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి హైదరాబాద్‌కు తరలించగా.. కోర్టు అతడికి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. అయితే ఈ కేసులో ఇప్పటికే చాలా ట్విస్ట్‌లు బయటపడ్డాయి. తాను, వైశాలి ఇంతకుముందే పెళ్లి చేసుకున్నట్లు నవీన్ రెడ్డి చెప్పగా.. తమ పెళ్లి జరగలేదని వైశాలి చెప్పింది. వైశాలి, నవీన్ రెడ్డి కుటుంబసభ్యులు కలిసి టూర్‌కి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వైశాలి తల్లిదండ్రులు కూడా గతంలో వీరి ప్రేమవివాహానికి ఒప్పుకున్నట్లు ప్రచారం జరిగింది. అసలు నిజం ఏంటనేది ఇప్పటికీ బయటపడలేదు.
ఇవి కూడా చదవండి :
- షర్మిల పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి…
- మహిళల్ని లైంగికంగా వేధిస్తున్నాడని టీడీపీ సర్పంచ్‌పై సొంత ఊరివాళ్లే పోస్టర్లు
- నా ప్రాణాలంటే కేసీఆర్ కు లెక్క లేదా? ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియో
- నేడు బీఆర్ఎస్ లోకి మాజీ ముఖ్యమంత్రి….
- బీజేపీలో ఈటల రాజేందర్ కు పెద్ద కష్టమే!
2 Comments