
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : గవర్నర్ తమిళిసైపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతోన్నాయి. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కౌశిక్ రెడ్డిపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. బీజేపీ సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. గవర్నర్‌పై చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర గవర్నర్‌ను అగౌరపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటని, ఒక మహిళా గవర్నర్‌పై ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు? అంటూ శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also : షర్మిల పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి…
అహంకారంతో ఒక గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. మహిళా గవర్నర్‌ను అవమానించడం అంటే మొత్తం మహిళా సమాజాన్ని అవమానించినట్లేనని, కౌశిక్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పలు పోలీస్ స్టేషన్లలో బీజేపీ నేతలు ఫిర్యాదు చేస్తున్నారు. గురువారం జమ్మికుంటలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న కౌశిక్ రెడ్డి.. తమిళిసైపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
Also Read : మహిళల్ని లైంగికంగా వేధిస్తున్నాడని టీడీపీ సర్పంచ్‌పై సొంత ఊరివాళ్లే పోస్టర్లు
అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లులకు తమిళిసై ఆమోదం తెలపడం లేదని, గవర్నర్ ఎందుకు దాచుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళి సై ఏ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారంటూ సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ పట్ల ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. గవర్నర్ పట్ల ఆయన మాట్లాడిన భాష సరిగ్గా లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. గవర్నర్‌కు కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- లోకేశ్ పాదయాత్రకు సర్వం సిద్ధం… 200 మంది ప్రైవేటు భౌన్సర్లు, 400 మంది వాలంటీర్లు
- ప్రారంభమైన దక్కన్ మాల్ కూల్చివేత పనులు… భారీ క్రేన్ల సహాయంతో కూల్చివేత
- కన్నీళ్లు పెట్టుకున్న సానియా మీర్జా
- నేడు బీఆర్ఎస్ లోకి మాజీ ముఖ్యమంత్రి….
- జగన్ సర్కార్‌పై పనితీరుపై ప్రశంసలు… శ్రీకాకుళం జిల్లాలో వాలంటీర్‌కు కేవలం 39 నిమిషాల్లోనే ఆరోగ్యశ్రీ కార్డు
2 Comments