
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : అనంతపురం జిల్లాలో టీడీపీ సర్పంచ్‌పై సొంత ఊరివాళ్లే పోస్టర్లు అంటించడం కలకలంరేపింది. బెలుగుప్ప మండలం ఆవులన్నే టీడీపీ సర్పంచ్ రామ్మోహన్ చౌదరిపై వాల్ పోస్టర్లు వెలిశాయి. గ్రామంలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని పోస్టర్లలో ముద్రించారు. ఎస్సీ, బీసీ మహిళల జీవితాలను నాశనం చేశాడని ఆరోపించారు. మండల వ్యాప్తంగా పబ్లిక్ , ప్రభుత్వ కార్యాలయాలకు పోస్టర్లు అతికించి ఉండడంతో రామ్మోహన్ చౌదరి వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. రామ్మోహన్ గ్రామ సమస్యలు పట్టించుకోకుండా.. తన అధికారాన్ని మరిచి గ్రామంలో నివసిస్తున్న ఆడవాళ్లను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు.
Read Also : లోకేశ్ పాదయాత్రకు సర్వం సిద్ధం… 200 మంది ప్రైవేటు భౌన్సర్లు, 400 మంది వాలంటీర్లు
అంతే కాకుండా ఆడవాళ్ల సంసారాల్లో చిచ్చు పెడుతున్నారని.. అతడి కన్ను పడితే ఏ ఒకరిని వదలని కామాంధుడన్నారు. తన రాజకీయ బలంతో ఆడవాళ్లను వేధిస్తున్నాడని.. ఎంతోమంది ఆడవాళ్ల సంసారాలను కూలుస్తున్నాడని మండిపడ్డారు. మహిళలకు డబ్బులు ఇచ్చి లొంగదీసుకుంటున్నాడని.. అతడు చెప్పిన మాట వినకుంటే.. ఇతరులకు డబ్బులు ఇచ్చి సంసారాలను విడదీస్తున్నారని ఆరోపించారు. ఇదంతా చాలా కాలంగా జరుగుతోందని.. రాజకీయ బలం ఉంది కాబట్టి ప్రజలు చూసి చూడనట్లు ఉన్నారన్నారు. తీరు మార్చుకోవాలని గ్రామ ప్రజలు ఎన్నోసార్లు హెచ్చరించారని.. అయినా పద్దతి మార్చుకోలేదని పోస్టర్లలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
- ప్రారంభమైన దక్కన్ మాల్ కూల్చివేత పనులు… భారీ క్రేన్ల సహాయంతో కూల్చివేత
- అలనాటి నటి జమున కన్నుమూత…..
- నేడు బీఆర్ఎస్ లోకి మాజీ ముఖ్యమంత్రి….
- నా ప్రాణాలంటే కేసీఆర్ కు లెక్క లేదా? ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియో
- బీజేపీలో ఈటల రాజేందర్ కు పెద్ద కష్టమే!
3 Comments