TelanganaUncategorized

రమ్య నన్ను చంపాలని చూసింది- కోర్టును ఆశ్రయించిన నటుడు నరేశ్

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ : సీనియర్ నటుడు నరేష్‌ , తన భార్య రమ్య రఘుపతి వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తనకు రమ్య రఘుపతి , రాకేశ్‌ శెట్టి తో ప్రాణహాని ఉందని నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తి కాజేయడానికి రమ్య ప్రయత్నించిందని, వీలుకాక పోవడంతో రమ్య తనను చంపడానికి ప్రయత్నించిందని నరేష్‌ ఆరోపించారు. సుపరి గ్యాంగ్ ను మాట్లాడుకుని నన్ను చంపాలనుకుందని ఆయన ఫిర్యాదు చేశారు.

Read Also : వైశాలి కిడ్నాప్ కేసులో నవీన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన రంగారెడ్డి కోర్టు…..

రమ్య రఘుతితో తనకు 2010 మార్చి3 న బెంగుళూరు లో వివాహమైనట్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్‌ అన్నారు. పెళ్లికి కట్నం కూడా తీసుకోలేదని నరేష్‌ అన్నారు. మా అమ్మ విజయ్ నిర్మల రమ్యకు 30 లక్షల రూపాయలకు బంగారం చేయించిందని ఆయన వెల్లడించారు. పెళ్లి అయిన కొన్ని నెలల నుండే రమ్య తనను వేధించడం ప్రారంభించిందని నరేష్‌ ఆరోపించారు. తన తల్లితో పాటుగా బెంగళూరులోనే ఉండాలని రమ్య షరతు పెట్టిందని నరేష్‌ అన్నారు.

Also Read : తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమం… బెంగుళూరుకు తరలించే అవకాశం

2012 లో రమ్య కు, తనకు రణ్వీర్ పుట్టాడని నరేష్‌ వెల్లడించారు. తనకు తెలియకుండానే పలు బ్యాంకులు, వ్యక్తుల దగ్గర రమ్య డబ్బు తీసుకుందని ఆయన ఆరోపించారు. తన పేరు చెప్పి రమ్య
లక్షల్లో అప్పులు చేసిందని, ఆ అప్పులు తీర్చడానికి 10 లక్షల రూపాయలు చెల్లించానని అన్నారు. అయితే, తన కుటుంబ సభ్యుల నుండి మరో 50 లక్షల రూపాయలు రమ్య తీసుకున్నట్లు నరేష్‌ చెప్పారు. తన ఆస్తి కాజేయడానికి రమ్య ప్రయత్నించిందని, అప్పు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి తనను వేధించేవారని ఆయన అన్నారు.

Read Also : గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి… పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు

2022 ఏప్రిల్ లో కొంతమంది అగంతకులు తన ఇంట్లో చొరబడి, 24 లక్షల రూపాయలు రికవరీ చేయడానికి వచ్చామని మాయ మాటలు చెప్పారని నరేష్‌ అన్నారు.ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు. తనకు నేను డబ్బులు ఇవ్వకపోవడంతో పలు రకాలుగా చంపాలని చూసిందని నరేష్‌ ఆరోపించారు. మాజీ మంత్రి కాంగ్రెస్ లీడర్ రఘువీరారెడ్డి తో ఫోన్ చేయించి బెదిరించిందని నరేష్‌ ఆరోపించారు. తనను చంపేస్తారనే భయంతో ఎక్కడికి ఒంటరిగా వెళ్ళటం లేదని నరేష్‌ వాపోయారు.

Also Read : బీజేపీలో ఈటల రాజేందర్ కు పెద్ద కష్టమే!

రమ్యకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ద్వారా హ్యాకింగ్ నేర్చుకుందని నరేష్‌ ఆరోపించారు. తన ఫోన్‌ను హ్యాక్ చేసి పర్సనల్ మెసేజ్‌లు చూసేదని, రమ్య వల్ల నరకయాతన అనుభవించాను,రమ్య వేధింపులు భరించలేకపోతున్నాను కనుక తనకు కోర్టు ద్వారా విడాకులు ఇప్పించాలని నరేష్‌ కోరారు.

ఇవి కూడా చదవండి : 

  1. షర్మిల పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి…
  2. మహిళల్ని లైంగికంగా వేధిస్తున్నాడని టీడీపీ సర్పంచ్‌పై సొంత ఊరివాళ్లే పోస్టర్లు
  3. నా ప్రాణాలంటే కేసీఆర్ కు లెక్క లేదా? ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియో
  4. నేడు బీఆర్ఎస్ లోకి మాజీ ముఖ్యమంత్రి….

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.