
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సాధారణ ప్రజలు డబ్బుల విషయంలో బ్యాంకులను ఎక్కువగా నమ్ముతారు. ముఖ్యంగా ప్రభుత్వ బ్యాంకులను ఇంకా ఎక్కువగా నమ్ముతారు. ఇలా నమ్మి బంగారం తాకట్టు పెట్టి లబోదిబోమంటున్నారు ఖాతాదారులు. ఈ ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో జరిగింది. రెంటపాళ్లలోని యూనియన్ బ్యాంకులో చాలా మంది బంగారంపై రుణాలు తీసుకున్నారు. అంటే బంగారాన్ని బ్యాంకు తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నారు. అయితే ఆ బంగారాన్ని బ్యాంకు ఉద్యోగులే మాయం చేయడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగారం మాయంలో బ్యాంక్ అప్రయిజర్ ఇమ్మిడిశెట్టి సంపత్ కుమార్ ఇందులో కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు.
Read Also : వైశాలి కిడ్నాప్ కేసులో నవీన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన రంగారెడ్డి కోర్టు…
మొత్తం కోటి 70 లక్షల విలువ చేసే బంగారాన్ని అప్రయిజర్ మాయం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాము తీసుకున్న రుణం చెల్లించినా బంగారం ఇవ్వకపోవటంతో బ్యాంకు అధికారుల్ని ఖాతాదారులు నిలదీయడంతో విషయం బయటకు వచ్చాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్యాంకు అధికారుల విచారించారు. విచారణలో బంగారం మాయమైనట్లు గుర్తించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మేనేజర్ రాంబాబు నాయక్, అసిస్టెంట్ మేనేజర్ రవికుమార్‌ను ఉన్నతాధికారులు ఇప్పిటికే సస్పెండ్ చేశారు. బంగారం మాయం చేసిన సంపత్ కుమార్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. డబ్బులు కట్టినా మూడు నెలలుగా బ్యాంకు అధికారులు బ్యాంకు చుట్టు తిప్పించుకుంటున్నారని బాధితులు వాపోయారు. బ్యాంకులో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
- తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమం… బెంగుళూరుకు తరలించే అవకాశం
- గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి… పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
- షర్మిల పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి…
- నేడు బీఆర్ఎస్ లోకి మాజీ ముఖ్యమంత్రి….
- మహిళల్ని లైంగికంగా వేధిస్తున్నాడని టీడీపీ సర్పంచ్‌పై సొంత ఊరివాళ్లే పోస్టర్లు
2 Comments