
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సూపర్ స్టార్ రజనీకాంత్ తన స్టైల్ తో ట్రెండ్ సెట్ చేశారు. అంతేకాదు ఆయన అంతే క్రమశిక్షణతో ఉంటారు. అందుకే ఆయన ఇంత గొప్ప స్థాయికి చేరుకున్నారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో రజనీకాంత్ తన భార్య లత గురించి చాలా గొప్పగా చెప్పారు. తన భార్య తనను ఎంతో మార్చేసిందని.. మద్యానికి బానిసైన తనను దారిలో పెట్టిందని ఎప్పుడూ చెబుతుంటారు. తాజాగా ఇదే విషయాన్ని ఆయన మరోసారి చెప్పారు. ఇప్పటికే ఎన్నో వేదికలపైన తన భార్య లత గురించి చెప్పిన రజనీ.. తాజాగా తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో వేదికపై మాట్లాడుతూ తన భార్య వల్లే క్రమశిక్షణ నేర్చుకున్నానని అన్నారు.
Read Also : రమ్య నన్ను చంపాలని చూసింది- కోర్టును ఆశ్రయించిన నటుడు నరేశ్ –
లతను తనకు పరిచయం చేసిన మహేంద్రన్ కు తాను రుణపడి ఉంటానని ఓ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న రజనీకాంత్ అన్నారు. బస్సు కండక్టర్ గా ఉన్న తాను రోజూ మద్యం తాగేవాడినని, సిగరేట్లు కూడా లెక్క లేకుండా తాగేవాడినని, రోజూ మాంసాహారం తీసుకునేవాడినని చెప్పారు. కానీ ఈ మూడు అలవాట్లు మంచివి కావు. వీటికి బానిసైన వాళ్లు కొంతకాలం తర్వాత ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపలేరు. తన భార్య లత తనను ఎంతో ప్రేమతో మార్చేసిందని చెప్పారు. ఆమె వల్లే తాను క్రమశిక్షణతో జీవితాన్ని గడుపుతున్నట్లు చెప్పుకొచ్చారు.
Also Read : బ్యాంకులో తాకట్టుపెట్టిన బంగారం మాయం… కేసు నమోదు చేసిన పోలీసులు –
రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది ఆయన 169వ సినిమా. ఇంకా ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- వైశాలి కిడ్నాప్ కేసులో నవీన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన రంగారెడ్డి కోర్టు…
- తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమం… బెంగుళూరుకు తరలించే అవకాశం
- గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి… పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
- షర్మిల పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి…
- నేడు బీఆర్ఎస్ లోకి మాజీ ముఖ్యమంత్రి….
2 Comments