
‘‘నా ప్రాణానికి తీవ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉందని ప్రభుత్వ అధికారులే చెబుతున్నారు. నాకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ చెడిపోతున్నా కొత్తది ఇవ్వకుండా దాన్నే తూతూమంత్రంగా మరమ్మతులు చేయించి పంపిస్తున్నారు. అంటే దీని అర్థం.. రాజాసింగ్ బతికితే ఏంటి? చనిపోతే ఏంటి? అనే భావనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు భావించాల్సి వస్తోంది’’ అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు గురువారం రాత్రి ఒక వీడియో విడుదల చేశారు. ‘‘రెండురోజుల కిందట నా బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయించింది. షెడ్‌కు తీసుకువెళ్లిన సిబ్బంది నిన్న తిరిగి అదే వాహనాన్ని పంపారు. పాడైన వాహనాన్ని ఎందుకు పంపిస్తున్నారని పైఅధికారులతో మాట్లాడితే.. దాన్నే మరమ్మతు చేసి పంపాలని పైనుంచి ఆదేశాలున్నాయి అని ఒక అధికారి అన్నారు’’ అని రాజాసింగ్ అందులో పేర్కొన్నారు.
2 Comments