
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కర్ణాటకలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పక్కన కూర్చున్న స్వామీజీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అసహనానికి గురైన సీఎం ఆయన మైక్ లాక్కున్నారు. స్వామీజీ విమర్శలను తిప్పికట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని మహదేవపురలో ఓ బహిరంగ కార్యక్రమంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కాగినేలె మహాసంస్థాన కనక గురు పీఠాధిపతి ఈశ్వరనందపురి స్వామీజీ పాల్గొన్నారు.
Read Also : బ్యాంకులో తాకట్టుపెట్టిన బంగారం మాయం… కేసు నమోదు చేసిన పోలీసులు
ఆయన మాట్లాడుతూ.. బెంగళూరులో సరైన మౌలికసదుపాయాలు లేవని నగరవాసులు అవస్థలు పడుతున్నారని సీఎం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. బెంగళూరులో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. వరదలు వచ్చినప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కేవలం వర్షాలు పడినప్పుడు మాత్రమే ఇక్కడకు వస్తున్నారని సమస్య వివరించారు. ఇవన్నీ తాము చాలా కాలంగా చూస్తూనే ఉన్నామని… వర్షాలు పడుతున్నప్పుడు ప్రజలు ఇబ్బందులు పడకుండా ఏం చేయాలో అధికారులకు తెలియదా? అంటూ నిలదీసే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి కూడా దీని గురించి గతంలో హామీలు ఇచ్చారని.. బొమ్మై సర్కారుపై విమర్శలు చేశారు.
Also Read : రమ్య నన్ను చంపాలని చూసింది- కోర్టును ఆశ్రయించిన నటుడు నరేశ్
ఈశ్వరనందపురి స్వామీజీ మాట్లాడుతున్న సమయంలో సీఎం బొమ్మై ఆయన పక్కనే కూర్చున్నారు. స్వామీజీ మాటలతో తీవ్ర అసహనానికి గురైన ముఖ్యమంత్రి.. ఆయన మైకును చేతుల్లో నుంచి లాగేసుకున్నారు. కేవలం హామీలు ఇచ్చి మర్చిపోయే ముఖ్యమంత్రిని తాను కాదన్నారు. అది కేవలం హామీ మాత్రమే కాదని.. దానిపై ఓ పథకం తీసుకొచ్చామని వివరించారు. నిధులు కూడా కేటాయించామని, పని జరుగుతుందని విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం స్వామీజీ నుంచి బొమ్మై మైకును లాక్కుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇవి కూడా చదవండి :
- నా భార్య వల్లే నేను క్రమశిక్షణ నేర్చుకున్నా-రజనీకాంత్
- వైశాలి కిడ్నాప్ కేసులో నవీన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన రంగారెడ్డి కోర్టు…..
- తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమం… బెంగుళూరుకు తరలించే అవకాశం
- గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి… పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
- షర్మిల పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి…