
గ్రేటర్ హైదరాబాద్ లో 74వ గణ తంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాదాపూర్ రవీంద్ర భారతీ స్కూల్లో జెండా పండుగను సంబరంగా నిర్వహించారు. రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కెనరా బ్యాంక్ మేనేజర్ తారక్ హరి ప్రసాద్ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆవిష్కరించారు. మాదాపూర్ రవీంద్ర భారతి స్కూల్ ప్రిన్సిపాల్ హైమా, డీఏ హఫీజ్, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు తారక్ హరి ప్రసాద్ బహుమతులు అందించారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన తారక్ హరిప్రసాద్.. భారత రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించారు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని చెప్పారు. ఉన్నతంగా చదవి.. ఉన్నత ఉద్యోగాలు సాధించి దేశ పురోగతిలో పాలు పంచుకోవాలని రవీంద్ర భారతీ స్కూల్ విద్యార్థులకు సూచించారు. రిపబ్లిక్ డే విశిష్టతను తెలియచేసేలా పలువురు విద్యార్థులు జాతీయ నేతల వేషాధారణతో వచ్చారు. సాంస్కాృతిక ప్రదర్శనలో భాగంగా పిరమిడ్ ఆకారంలో నిల్చుని విద్యార్థులు చేసిన నృత్యం అందరిని ఆకట్టుకుంది.