
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : స్టార్ కమెడియన్ సునీల్ హీరోగా టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. మొదట హీరోగా చేసిన సినిమాలు విజయవంతమైనా.. తర్వాత ఫ్లాప్ లు చూడాల్సి వచ్చింది. మెల్లగా తన కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. అలాగే హీరోగా మాత్రమే సినిమాలు చేయడంతో కమెడియన్ స్టాంప్ కూడా పోగొట్టుకున్నాడు. మళ్లీ కమెడియన్ గా మంచి సక్సెస్ కోసం కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటి వరకు సరైన బ్రేక్ దొరకలేదు. ఇదిలా ఉంటే సునీల్ నెమ్మదిగా చిన్న బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నాడు.
Read Also : దుర్గమ్మ చెంత జనసేనాని… వారాహికి ప్రత్యేక పూజలు
కనబడుట లేదు, వాంటెడ్ పండుగాడు, ముఖచిత్రం, దర్జా వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. కానీ ఎప్పుడూ ఈ చిత్రాల ప్రమోషనల్ ఈవెంట్లలో మాత్రం కనిపించలేదు. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం.. చిన్న బడ్జెట్ సినిమాల్లో చేయడానికి సునీల్ సిద్ధంగా ఉన్నా.. ప్రమోషన్స్ లో పాల్గొననని మేకర్స్ కు ముందే చెబుతున్నాడని తెలుస్తోంది. అయితే, నిర్మాతలు సినిమాల ప్రచారాల్లో సునీల్ ముఖం అతని పేరును మాత్రం ఉపయోగించవచ్చు. అంటే సునీల్ ముఖం సినిమా పోస్టర్లలో కనిపిస్తుంది కానీ.. ప్రమోషన్స్ కు సంబంధించిన ఈవెంట్లలో కనిపించడని స్పష్టమవుతోంది. సునీల్ నటించిన చిన్న బడ్జెట్ చిత్రం వాలెంటైన్స్ డే ఈనెల 26న విడుదల కాబోతుంది.
ఇవి కూడా చదవండి :
- ఆస్కార్‌కు RRR ‘నాటు నాటు’ సాంగ్ నామినేట్…. బండి సంజయ్ తో రాహుల్ సిప్లిగంజ్ సెలబ్రేషన్
- రాష్ట్ర గవర్నర్ కు ప్రభుత్వం కనీస గౌరవం ఇవ్వడం… బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
- కేంద్ర ప్రభుత్వంపై విరుచుకపడిన మంత్రి కేటిఆర్…
- మహారాష్ట్ర ఎంఎల్‌సి ఎన్నికల తరువాత ఫిబ్రవరి 5న నాందేడ్ లో బీఆర్ఎస్ భహిరంగ సభ..!!
- నల్గొండ బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు… మంత్రి సమక్షంలో ఫైర్ అయిన ఎమ్మెల్యే చిరుమర్తి
One Comment