
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో పర్యటించారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని పవన్, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్‌కు ఆలయం మర్యాదలతో స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ అమ్మవారిని అంతరాలయం గుండా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు సమర్పించారు. దుర్గమ్మ దర్శనం అనంతరం జనసేనానికి ఆలయ ఆవరణలో వేద పండితుల ఆశీర్వచనం అందజేశారు.
Read Also : ఆస్కార్‌కు RRR ‘నాటు నాటు’ సాంగ్ నామినేట్…. బండి సంజయ్ తో రాహుల్ సిప్లిగంజ్ సెలబ్రేషన్
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు పవన్ చెప్పారు. పవన్ కళ్యాణ్ ఇంద్రకీలాద్రి కింద జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహి వాహనానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. నేటి నుంచి రాక్షస పాలన అంతం చేయడమే వారాహి లక్ష్యమన్నారు. తెలుగు రాష్ట్రాలు ఐక్యతతో ఉండాలన్నారు. మరోవైపు జనసేనానిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు కొండగట్టు ఆలయంలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇవాళ విజయవాడలో దుర్గమ్మ సన్నిధిలో పూజలు చేశారు.
ఇవి కూడా చదవండి :
- రాష్ట్ర గవర్నర్ కు ప్రభుత్వం కనీస గౌరవం ఇవ్వడం… బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
- కేంద్ర ప్రభుత్వంపై విరుచుకపడిన మంత్రి కేటిఆర్…
- కొండగట్టులో ముగిసిన జనసేనాని వారాహి పూజలు… బ్రహ్మరథం పట్టిన అభిమానులు
- యాగాలు, పూజలతో కొత్త సెక్రటేరియట్ ప్రారంభం… హాజరు కానున్న జాతీయ నాయకులు, ప్రముఖులు
- జపాన్ 46 వ అకాడమీ అవార్డ్స్ లో అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో “ఆర్ఆర్ఆర్” అవార్డు
One Comment