
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. బీఆర్ఎస్‌ను గద్దె దించి అధికారం చేజిక్కించుకోవాలని ప్రతిపక్షాలు భావిస్తుండగా… హ్యాట్రిక్ విజయం సాధించి తమకు తిరుగులేదని నిరూపించుకునేందుకు బీఆర్ఎస్ ఉవ్విలూరుతోంది. మరోవైపు తెలంగాణలో తన ఉనికి చాటుకోవాలని తెలుగుదేశం పార్టీ యత్నిస్తుంది. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా నేతలు పక్కా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో తాము కూడా గట్టిపోటి ఇవ్వబోతున్నామనే సంకేతాలను తెలంగాణలోని అన్ని పార్టీలకు పంపించారు.
Also Read : కొండగట్టుకు బయలుదేరిన పవన్ కల్యాణ్…. హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్‌లో చిక్కుకున్న జనసేనాని
ఖమ్మం సభ సక్సెస్ కావటంతో తెలుగు తమ్ముళ్లోనూ జోష్ వచ్చింది. పార్టీని వీడి ఇతర పార్టీలో చేరిన నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానించే పనిలో పసుపు అధినాయకత్వం నిమాగ్నమైంది. ఈ మేరకు ఖమ్మం సభలో ప్రసంగించిన చంద్రబాబు.. పార్టీకి దూరమైన నేతలంతా తిరిగి రావాలని కోరారు. ఇక చంద్రబాబు డైరక్షన్‌లో.. టీటీడీపీ నూతన అధ్యక్షుడు కాసాని జ్జానేశ్వర్ ముదిరాజ్ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. వరుసగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్విహిస్తూ.. దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఖమ్మం సభ సక్సెస్ కావటంతో త్వరలో నిజామాబాద్‌లో మరో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఇతర పార్టీల్లో అసంతృప్తిలో ఉన్న నేతలను తమవైపు తిప్పుకునే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో తెలంగాణ టీడీపీ రాష్ట్రస్థాయి సమావేశంలో మాట్లాడిన కాసాని జ్జానేశ్వర్.. పార్టీ పటిష్టత కోసం పాటు పడాలని నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు గాను.. ‘ఇంటింటికి తెదేపా’ కార్యక్రమాన్ని పెద్దయెత్తున నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
Read Also : పాలమూరు వేదికగా బీజేపీ బడా స్కెచ్.. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో ఎన్నికల రోడ్ మ్యాప్!!
‘ఇంటింటికి తెదేపా’ కార్యక్రమంలో భాగంగా.. పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి మహిళలకు బొట్టుపెట్టి పార్టీ ప్రచార పత్రాలు అందజేయాలన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని.., స్థానిక సంస్థల ఎన్నికలకు రెండేళ్ల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణలోని ప్రతి పల్లెలోనూ, ప్రతి చౌరస్తాలోనూ టీడీపీ పతాకం ఎగరాలని అన్నారు. ఇలా పక్కా వ్యూహంతో స్పీడ్ పెంచిన కాసాని.. పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని భావిస్తున్నారు. ఏపీలో ఈనెల 27న నారా లోకేశ్ చేపట్టనున్న యువగళం పాదయాత్ర ప్రారంభమవుతుందని.., తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోని టీటీడీపీ నేతలు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలపాలని కాసాని జ్జానేశ్వర్ శ్రేణులకు సూచించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ పాదయాత్రతకు సంబంధించిన వాల్ పేపర్స్, టీ షర్టును ఆవిష్కరించారు. అనంతరం ఆదివాసీ ఐకాస రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొరను కాసాని పార్టీలోకి ఆహ్వానించారు.
ఇవి కూడా చదవండి :
- దేశంలోనే అత్యంత ధనిక రాజకీయ పార్టీగా బీజేపీదే మొదటి స్థానం
- మావోయిస్టు నేత గాజర్ల రవిపై రూ.10 లక్షల రివార్డు…. మరో ముగ్గురిపై ప్రకటించిన ఎన్‌ఐఏ
- ఇతర క్యారెట్ల కంటే బ్లాక్ క్యారెట్ లో బోలెడు పోషకాలు.. అవేంటో తెలుసా?
- చైనాలో కరోనా విజృంభణ.. ఇప్పటికే 80 శాతం మందికి వైరస్
- వరల్డ్ టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో మంత్రి కేటీఆర్
2 Comments