

క్రైమ్ మిర్రర్, నారాయనపేట ప్రతినిధి : నారాయణపేట జిల్లాలో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ పర్యటలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభించారు. మొదట సింగారం వద్ద బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేకగా నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు సీటులో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిని కూర్చుండబెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల నోట్లో మట్టి కొడుతున్న కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు. పాలమూరు ఎంపీ నియోజకవర్గం నుంచి మోడీని ఎంపీగా పోటీ చేయాలని బీజేపీ నాయకులు అంటున్నారు. అసలు ఏ ముఖం పెట్టుకుని పాలమూరులో ఓట్లు అడుగుతారని విమర్శించారు.
Read Also : జపాన్ 46 వ అకాడమీ అవార్డ్స్ లో అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో “ఆర్ఆర్ఆర్” అవార్డు
సిలిండర్ రేటు పెంచి కట్టెల పొయ్యి దిక్కు చేసినందుకు ఆడబిడ్డలకు మోడీ దేవుడా? లేక పెట్రోల్ రేట్ పెంచినందుకు మోడీ దేవుడా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. అంతకు ముందు కేటీఆర్ పార్టీ కార్యాలయం వద్ద గులాబీ జెండాను ఎగుర వేశారు. అనంతరం సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు. సమీకృత మార్కెట్, సఖీ కేంద్రాన్ని మంత్రులతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. కొండారెడ్డిపల్లి చెరువు మినీ ట్యాంక్ బండ్, సీనియర్ సిటిజన్ పార్క్‌ను కూడా ప్రారంభించారు. రైతులపై ఆదాయపు పన్ను విధించేందుకు కేంద్రం ఆలోచిస్తుందని కేటీఆర్ ఆరోపించారు. ప్రధాని మోడీ ఆర్థిక సలహాదారు విబేక్ దేబ్రాయ్ నిన్న ఒక పత్రికలో వ్యాసం రాశారని అయి చెప్పారు.
ఇవి కూడా చదవండి :
- యాగాలు, పూజలతో కొత్త సెక్రటేరియట్ ప్రారంభం… హాజరు కానున్న జాతీయ నాయకులు, ప్రముఖులు
- కొండగట్టులో ముగిసిన జనసేనాని వారాహి పూజలు… బ్రహ్మరథం పట్టిన అభిమానులు
- పవన్ తో బీజేపీ కటీఫ్… తెలుగుదేశం పార్టీనే కారణం కాబోతుందా..???
- మహారాష్ట్ర ఎంఎల్‌సి ఎన్నికల తరువాత ఫిబ్రవరి 5న నాందేడ్ లో బీఆర్ఎస్ భహిరంగ సభ..!!
- తెలంగాణపై టీడీపీ నజర్… దూకుడు పెంచిన అధ్యక్షుడు కాసాని
2 Comments