
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు నాట మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన సినిమా. ఒక్క తెలుగు భాషలోనే కాకుండా ప్రపంచ భాషల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సినిమా “ఆర్ఆర్ఆర్”. దక్షిణాది చిత్రాల ఖ్యాతిని ఖండాంతరాలు ఇనుమడింపజేసిన సినిమా ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్ కు అవార్డుల పంట పండుతుంది. దేశ విదేశాలలో ఎంతో విశిష్ట ఖ్యాతిని ఆర్జించింది రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్. ఇక అటువంటి “ఆర్ఆర్ఆర్” తాజాగా మరో అరుదైన అవార్డును తన ఖాతాలో వేసుకుంది.
Read Also : యాగాలు, పూజలతో కొత్త సెక్రటేరియట్ ప్రారంభం… హాజరు కానున్న జాతీయ నాయకులు, ప్రముఖులు
జపాన్ 46 వ అకాడమీ అవార్డ్స్ లో అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో “ఆర్ఆర్ఆర్” అవార్డును సొంతం చేసుకుంది. ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న అవతార్ ద వే ఆఫ్ వాటర్, టాప్ గన్ మావెరిక్ వంటి హాలీవుడ్ చిత్రాలను దాటి, రాజమౌళి దర్శకత్వ వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుతం సృష్టించింది. అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో “ఆర్ఆర్ఆర్” అకాడమీ అవార్డును కైవసం చేసుకుంది. జపాన్ దేశంలో ఈ చిత్రాన్ని నాలుగు లక్షల మందికి పైగా వీక్షించారు. గతేడాది జపాన్ లో విడుదలైన ఈ సినిమా అక్కడ బ్రహ్మాండంగా ప్రదర్శితం అవుతుంది.
Also Read : కొండగట్టులో ముగిసిన జనసేనాని వారాహి పూజలు… బ్రహ్మరథం పట్టిన అభిమానులు
జపాన్ లో విడుదల అయ్యి మూడు నెలలు గడిచినా ప్రజలు ఇంకా ఈ సినిమాను చూడడానికి థియేటర్లకు పరుగులు పెడుతున్నారు అంటే సినిమాకి ఉన్న క్రేజ్ ఎంతటితో అర్థం చేసుకోవచ్చు. తెలుగు బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టడమే కాకుండా, సంచలనాల దిశగా దూసుకుపోతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ పురస్కారం వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్ రేసులో ఉన్నట్టుగా కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇక ఇదే సమయంలో మొత్తం 10 భారతీయ చిత్రాలు ఆస్కార్ బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఇక నేడు ఆస్కార్ నామినేషన్స్ నేపథ్యంలో ఖచ్చితంగా ఆస్కార్ జాబితాలో ఆర్ ఆర్ఆర్ ఉంటుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- పవన్ తో బీజేపీ కటీఫ్… తెలుగుదేశం పార్టీనే కారణం కాబోతుందా..???
- మహారాష్ట్ర ఎంఎల్‌సి ఎన్నికల తరువాత ఫిబ్రవరి 5న నాందేడ్ లో బీఆర్ఎస్ భహిరంగ సభ..!!
- తెలంగాణపై టీడీపీ నజర్… దూకుడు పెంచిన అధ్యక్షుడు కాసాని
- జగన్ సర్కార్‌పై పనితీరుపై ప్రశంసలు… శ్రీకాకుళం జిల్లాలో వాలంటీర్‌కు కేవలం 39 నిమిషాల్లోనే ఆరోగ్యశ్రీ కార్డు
- అంత కారం తాను తినలేను… తెలంగాణ వంటకాలపై రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
One Comment