
క్రైమ్ మిర్రర్, హైద్రాబాద్ ప్రతినిధి : జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి బయలుదేరారు. జనసేన పార్టీ ప్రచార రథం వారాహి వాహనానికి దేవాలయంలో అర్చకులతో ప్రత్యేక పూజలు చేయించనున్నారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామికి పవన్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇందుకోసం హైదరాాబాద్ నుంచి జనసేన నేతలు, కార్యకర్తలతో కలిసి భారీ కాన్వాయ్‌తో వెళ్లారు. ఉదయం 11 గంటలకు కొండగట్టుకు పవన్ చేరుకోవాల్సి ఉంది. అయితే పవన్ ప్రయాణిస్తున్న వాహనం భారీ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. లారీ రిపేర్ కావడంతో హకీంపేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పవన్ కల్యాణ్ కాన్వాయ్ ట్రాఫిక్‌లో చిక్కుకుంది.
Read Also : దేశంలోనే అత్యంత ధనిక రాజకీయ పార్టీగా బీజేపీదే మొదటి స్థానం
ట్రాఫిక్ క్లియర్ చేసి పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌కు ట్రాఫిక్ పోలీసులు దారి ఇచ్చే ప్రయత్నం చేస్తోన్నారు. ట్రాఫిక్ సమస్య వల్ల పవన్ పర్యటన ఆలస్యం కానుందని తెలుస్తోంది. కొండగట్టు చేరుకున్న తర్వాత ఆంజనేయస్వామి ఆలయంలో వారాహి ప్రచార రథానికి శాస్త్రోక్తంగా పవన్ పూజలు చేయించనున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వారాహికి పూజలు చేసిన అనంతరం ప్రచార రథాన్ని పవన్ ప్రారంభించనున్నారు. వారాహి ప్రారంభించిన అనంతరం నాచుపల్లి సమీపంలోని కోడీమ్యాల మండలం పరిధిలోని బృందావన్ రిసార్ట్‌లో తెలంగాణ జనసేన నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ కీలక సమావేశంలో తెలంగాణలోని 32 నియోజకవర్గ కార్యానిర్వహక సభ్యులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో తెలంగాణలో జనసేన భవిష్యత్ కార్యాచరణపై నేతలతో పవన్ చర్చించనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
Also Read : ఒకే రోజు, ఒకే సమయం, 25 నగరాల్లో వాల్తేర్ వీరయ్య ప్రదర్శన.. అమెరికాలో సూపర్ సక్సెస్
నేతలతో సమావేశం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3.30 గంటలకు ధర్మపురి చేరుకోనున్న పవన్.. లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అనుష్టుప్ నారసింహ యాత్రకు పవన్ శ్రీకారం చుట్టనున్నారు. ఈ యాత్రలో భాగంగా మరో 31 నారసింహ క్షేత్రాలను దశలవారీగా పవన్ సందర్శించనున్నారు. ధర్మపురిలో స్వామివారి దర్శనం తర్వాత పవన్ సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి రాత్రికి హైదరాాబాద్ చేరుకోనున్నారు. జనసేనాని పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. తెలంగాణలో పవన్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో చాలారోజుల తర్వాత రాష్ట్రంలో పవన్ రాష్ట్రంలో పర్యటిస్తుండటంతో.. అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. పవన్ పర్యటనల్లో పాల్గొనేందుకు భారీగా ఇతర జిల్లాల నుంచి కూడా అభిమానులు చేరుకుంటున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు జనసేన నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు.
ఇవి కూడా చదవండి :
- టాలీవుడ్ లో మరో విషాదం.. యువ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్య
- నిర్మల్ జిల్లా బాసరలో విషాదం… ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలో దూకిన తల్లి
- 21 దీవులకు 21 సైనికవీరుల పేరు పెట్టిన ప్రధాని మోదీ… 21 మంది కూడా ‘పరమ్ వీర్ చక్ర’ గ్రహీతలు
- రాజమౌళికి జేమ్స్ కేమరూన్ బంపరాఫర్….
- గోడలపై మూత్రం పోశారా?.. ఇక అంతే సంగతులు
One Comment