

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ వంటకాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణల వంటకాల్లో కాస్త ఘాటు ఎక్కువగా ఉంటుందని.., అంత కారం తాను తినలేనని అన్నారు. రాహుల్ గాంధీ తాను చేపట్టిన భారత్ జోడో యాత్ర రాజస్థాన్‌లో కొనసాగిన సమయంలో ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ కర్లీ టేల్స్ ప్రతినిధి కామియా జానీకి సరదగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోను తాజాగా.. కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్టు చేసింది. ఈ వీడియోలో రాహుల్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆహారపు అలవాట్ల గురించి జానీ రాహుల్‌ను అడగ్గా.. తాను భోజనానికి అంత ప్రాధాన్యత ఇవ్వనని చెప్పారు.
Read Also : జగన్ సర్కార్‌పై పనితీరుపై ప్రశంసలు… శ్రీకాకుళం జిల్లాలో వాలంటీర్‌కు కేవలం 39 నిమిషాల్లోనే ఆరోగ్యశ్రీ కార్డు
తినే సమయానికి ఏది అందుబాటులో ఉంటే అదే తినేస్తానని చెప్పారు. జోడో యాత్రలో భాగంగా.. అనేక రాష్ట్రాల వంటకాలు రుచి చూశానని చెప్పారు. కానీ తెలంగాణలోని వంటకాలు కాస్త ఘాటుగా అనిపించాయని.., అక్కడ కారం కాస్త ఎక్కవగా తింటారని.., అంత కారం తాను తినలేనని రాహుల్ వెల్లడించారు. తనకు బఠాణీ, పనసపండు అంటే అస్సలు నచ్చవని చెప్పారు. తాను నాన్వెజిటేరియన్ అని చెప్పిన రాహుల్ గాంధీ.. చికెన్, మటన్, సీఫుడ్ అన్నీ లాంగించేస్తానన్నారు. చికెన్ టిక్కా, సీఖ్ కబాబ్, ఆమ్లెట్ తన ఫేవరెట్ ఫుడ్ అని వెల్లడించారు. వీటన్నింటితో పాటు రోజు ఉదయం ఓ కప్పు కాఫీ నోట్లో పడాల్సిందేనని రాహుల్ చెప్పుకొచ్చారు. ఇక తన పెళ్లి గురించి కూడా రాహుల్ గాంధీ ఆసక్తిర కామెంట్స్ చేశారు. తన కాబోయే భాగస్వామి కోసం.. ఎలాంటి చెక్ లిస్ట్ లేదని వెల్లడించారు. తాను పెళ్లికి వ్యతిరేకం కాదని.. సరైన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని చెప్పారు. ప్రేమగా చూసుకునే అమ్మాయి, తెలివైన అమ్మాయి దొరికితే చాలు అని అన్నారు. తమ అమ్మానాన్నలది ప్రేమ వివాహమన్న రాహుల్ వారు ఎంతో అన్యోన్యంగా ఉండేవారన్నారు. అందువల్ల తన అంచనాలు కాస్త పైనే ఉంటాయన్నారు. తన తల్లి సోనియా గాంధీ, తన నాన్నమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వంటి లక్షణాలను తన భాగస్వామిలో కలిగి ఉండాలని కోరుకుంటున్నట్లు రాహుల్ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చారు.
Also Read : తెలంగాణపై టీడీపీ నజర్… దూకుడు పెంచిన అధ్యక్షుడు కాసాని
కుటుంబ పరిస్థితుల కారణంగా తాను ఇంట్లోనే చదువుకోవాల్సి వచ్చిందని రాహుల్ అన్నారు. తన నానమ్మ ఇందిరా గాంధీ చనిపోయిన తర్వాత తనను బోర్డింగ్ స్కూల్ నుంచి తీసుకొచ్చారని చెప్పారు. ఆ తర్వాత ఇంట్లోనే ఉండి చదువుకోవాల్సి వచ్చిందన్నారు. ఉన్నత విద్య కోసం హార్వర్డ్‌కు వెళ్లానని.. నాన్న )రాజీవ్ గాంధీ) హత్య తర్వాత అక్కడి నుంచి తనను ఫ్లోరిడాకు పంపించారని చెప్పుకొచ్చారు. చదువు పూర్తయ్యాక లండన్‌లో ఓ కన్సల్టెన్సీ కంపెనీలో ఉద్యోగం కూడా చేశానని రాహుల్ గాంధీ వెల్లడించారు. తన తొలి జీతం 2500-3000 పౌండ్లు అని రాహుల్ ఇంటర్వ్యూలో వివరించారు. ఇక రాహుల్ గాంధీ గతేడాది సెప్టెంబర్ 7న తమిళనాడులో కన్యాకుమారిలో భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. 129 రోజుల్లో 12 రాష్ట్రాల్లో రాహుల్ తన పాదయాత్ర పూర్తి చేశారు. ప్రస్తుతం రాహుల్ జమ్మూలో యాత్ర కొనసాగిస్తుండగా.. ఈనెల 30న శ్రీనగర్‌లో పాదయాత్ర ముగియనుంది.
ఇవి కూడా చదవండి :
- దేశంలోనే అత్యంత ధనిక రాజకీయ పార్టీగా బీజేపీదే మొదటి స్థానం
- కొండగట్టుకు బయలుదేరిన పవన్ కల్యాణ్…. హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్‌లో చిక్కుకున్న జనసేనాని
- ‘టీడీపీ-జనసేన పొత్తు.. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి’.. కుండబద్దలు కొట్టిన మాజీ మంత్రి
- విశాఖలో ఏఆర్ కానిస్టేబుల్ దందా.. ప్రేమికుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వైనం !!!
- రాజమౌళికి జేమ్స్ కేమరూన్ బంపరాఫర్….
One Comment