
క్రైమ్ మిర్రర్, మహబూబ్ నగర్ ప్రతినిధి : రాష్ట్ర గవర్నర్ కు ప్రభుత్వం కనీస గౌరవం ఇవ్వడం లేదని తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర గవర్నర్ ను పట్టించుకోవడం లేదు, గవర్నర్ లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారా అని ఆయన ప్రశ్నించారు. నేడు మహబూబ్ నగర్ లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన పాల్గొని మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఏ దేశం గురించి మాట్లాడితే ఆ దేశం దివాళా తీస్తుంది. చైనా గురించి మాట్లాడితే కరోనా సంక్షోభంతో బిక్కుబిక్కుమంటుంది. తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయ ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజలు బీజేపీకి ఈసారి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇక ప్రస్తుతం శ్రీలంక, పాకిస్థాన్ ఎంతటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయో మనం చూస్తున్నాం.
Read Also : కేంద్ర ప్రభుత్వంపై విరుచుకపడిన మంత్రి కేటిఆర్…
కేంద్రం సరైన విధివిధానాల వల్లే భారత్ పరిస్థితి ఇప్పుడు వాటికంటే మెరుగ్గా ఉన్నాయని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు కనీస గౌరవం కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని బండి సంజయ్ విమర్శించారు. అసలు గవర్నర్ లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారా అని బండి ప్రశ్నించారు.కేసీఆర్, కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అలాగే సంక్షేమ కార్యక్రమాల అమలుపై కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలని అన్నారు. ఇక జీవో నెంబర్ 317కు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న ప్రభుత్వ టీచర్లకు బండి సంజయ్ మద్దతు తెలిపారు. జీవో 317ను సవరించకుంటే వారికి మద్దతుగా ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. కాగా గవర్నర్ కు, ప్రభుత్వానికి మధ్య కొంతకాలంగా దూరం పెరిగిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
- జపాన్ 46 వ అకాడమీ అవార్డ్స్ లో అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో “ఆర్ఆర్ఆర్” అవార్డు
- యాగాలు, పూజలతో కొత్త సెక్రటేరియట్ ప్రారంభం… హాజరు కానున్న జాతీయ నాయకులు, ప్రముఖులు
- కొండగట్టులో ముగిసిన జనసేనాని వారాహి పూజలు… బ్రహ్మరథం పట్టిన అభిమానులు
- మహారాష్ట్ర ఎంఎల్‌సి ఎన్నికల తరువాత ఫిబ్రవరి 5న నాందేడ్ లో బీఆర్ఎస్ భహిరంగ సభ..!!
- పవన్ తో బీజేపీ కటీఫ్… తెలుగుదేశం పార్టీనే కారణం కాబోతుందా..???
One Comment