
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కొన్ని రోజులుగా పొత్తుల చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం జరగబోతుందని తెలుస్తోంది. ఇంతకాలం తమతో పొత్తులో ఉన్న జనసేనకు బీజేపీ కటీఫ్ చెప్పబోతుందని తెలుస్తోంది. ఇందుకు తెలుగుదేశం పార్టీనే కారణం కాబోతోందని అంటున్నారు. వైసీపీని ఓడించడమే లక్ష్యమంటున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. తెలుగుదేశం పార్టీతో సఖ్యతగా ఉంటున్నారు. టీడీపీ పొత్తుకు పవన్ దాదాపుగా సిద్ధమయ్యారనే వార్తలు వస్తున్నాయి. ఇటీవలే చంద్రబాబును కలిశారు జనసేనాని. పొత్తులపై చర్చించడానికే పవన్ వెళ్లారనే టాక్ వచ్చింది.
Read Also : మహారాష్ట్ర ఎంఎల్‌సి ఎన్నికల తరువాత ఫిబ్రవరి 5న నాందేడ్ లో బీఆర్ఎస్ భహిరంగ సభ..!!
అదే సమయంలో 2014 తరహాలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి పవన్ ప్రయత్నాలు చేస్తున్నారని.. కేంద్రం పెద్దలతో మాట్లాడుతున్నారనే ప్రచారం సాగింది. టీడీపీ విషయంలో తమ స్టాండ్ ఏంటో పవన్ కు బీజేపీ పెద్దలు స్పష్టంగా చెప్పారని సమాచారం. టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పేశారట. జనసేనతో ముందుకు వెళ్లడానికి సిద్ధమని.. కాని టీడీపీని కలుపుకుని పోయే అవకాశం ఉండదని స్పష్టం చేశారట. భీమవరంలో జరుగుతున్న పార్టీ కార్యవర్గ సమావేశంలో పొత్తలపై బీజేపీ స్పష్టమైన ప్రకటన చేయవచ్చని అంటున్నారు. టీడీపీతో వెళితే పవన్ కు కటీఫ్ చెప్పాలని కమలదళం దాదాపుగా డిసైడ్ అయిందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తుల వల్ల చాలా నష్టపోయామని బిజెపి భావిస్తోంది.
Also Read : అంత కారం తాను తినలేను… తెలంగాణ వంటకాలపై రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
గతంలో తెలుగుదేశం పార్టీతో పలుమార్లు పొత్తు పెట్టుకోవడం వల్లే ఏపీలో బీజేపీ ఎదగలేదు అన్న అభిప్రాయం కూడా జాతీయ నాయకత్వంలో ఉంది.ఏపీలో పొత్తులతో కాకుండా సింగిల్ గానే ముందుకు వెళ్లాలని బిజెపి డిసైడ్ అయినట్టుగా పార్టీ వర్గాలలో చర్చ జరుగుతుంది. అధిష్టానం మాటను సోము వీర్రాజు ఇప్పటికే ప్రకటించినప్పటికీ, బిజెపి నేతల్లో మరింత క్లారిటీ రావాల్సి ఉంది. జనసేన తో పొత్తు పెట్టుకున్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపితో కలిసి పనిచేయకపోవడం, బిజెపి మైనర్ భాగస్వామిగా ఉండాల్సి రావడం వంటి పరిణామాలు జాతీయ పార్టీ అయిన బిజెపికి ఇబ్బందిగా మారాయి. ముఖ్యమంత్రిని చేస్తామని ఇతర పార్టీ నేతలను బతిమిలాడాల్సిన అవసరం ఏముంది అన్న అభిప్రాయం బిజెపి అధిష్టానం లో వ్యక్తం అవుతుంది. జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కు ప్రాధాన్యతను ఇచ్చినా ఆయన బీజేపీని పట్టించుకోవటం లేదన్న చర్చ జరుగుతుంది.
ఇవి కూడా చదవండి :
- జగన్ సర్కార్‌పై పనితీరుపై ప్రశంసలు… శ్రీకాకుళం జిల్లాలో వాలంటీర్‌కు కేవలం 39 నిమిషాల్లోనే ఆరోగ్యశ్రీ కార్డు
- తెలంగాణపై టీడీపీ నజర్… దూకుడు పెంచిన అధ్యక్షుడు కాసాని
- కొండగట్టుకు బయలుదేరిన పవన్ కల్యాణ్…. హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్‌లో చిక్కుకున్న జనసేనాని
- ‘టీడీపీ-జనసేన పొత్తు.. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి’.. కుండబద్దలు కొట్టిన మాజీ మంత్రి
- ఒకే రోజు, ఒకే సమయం, 25 నగరాల్లో వాల్తేర్ వీరయ్య ప్రదర్శన.. అమెరికాలో సూపర్ సక్సెస్
One Comment