
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : అమెరికాలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. చిరంజీవి ఫ్యాన్స్‌కు పండుగ వాతావరణం కనిపించింది. కేవలం మెగాస్టార్ ఫ్యాన్స్ కోసమే ప్రత్యేకంగా వాల్తేరు వీరయ్య స్పెషల్ షో ప్రదర్శించారు. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా కొత్త ప్రయోగం చేశారు. ఒకే రోజు, ఒకే సమయం, 25 నగరాల్లో ప్రత్యేకంగా అభిమానుల కోసమే వాల్తేరు వీరయ్య సినిమాను ప్రదర్శించారు. యూఎస్‌లోని 25 సినీమార్క్ స్క్రీన్స్‌పై ఈ స్పెషల్ షో ప్రదర్శించారు. మొట్ట మొదటిసారి వాల్తేరు వీరయ్యతో ఈ ప్రయోగం చేశారు .యూఎస్‌లోని మెగా అభిమానులకోసం ఈ సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఫ్యాన్స్ స్పెషల్‌షో సందర్భంగా థియేటర్లు కిక్కిరిసిపోయాయి. జై చిరంజీవ నినాదాలతో ఆ 25 సినిమా హాళ్లన్నీ మారుమోగాయి. అయితే, ఈ షో చూస్తున్న మెగాస్టార్ ఫ్యాన్స్‌కు ఓ స్పెషల్ కిక్ ఉంది.
Read Also : నిర్మల్ జిల్లా బాసరలో విషాదం… ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలో దూకిన తల్లి
సర్‌ప్రైజ్ సన్నివేశం ఉంది. వాల్తేరు వీరయ్య స్పెషల్ షో పూర్తయ్యాక మెగాస్టార్ చిరంజీవి లైవ్ స్పీచ్ ఇచ్చారు. ఈ సినిమా చూస్తున్న 25 థియేటర్లలోని మెగాస్టార్ ఫ్యాన్స్‌కు లైవ్‌లో చిరంజీవి మాట్లాడారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారు జామున నాలుగున్నర గంటలకు సినిమా మొదలయ్యింది. సినిమా పూర్తికాగానే చిరంజీవి అభిమానులతో మాట్లాడారు. ఈ పరిణామంతో మెగాస్టార్ అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. అన్నయ్య మెగాస్టార్ లైవ్ స్పీచ్ వినాలని ఉవ్విళ్లూరిన అభిమానుల కోరిక నెరవేరింది. వాల్తేరు వీరయ్యతో ఈ కొత్త ప్రయోగం సూపర్ సక్సెస్ అని అభిమానులు అంటున్నారు. ఇక, ఈ సినిమా ప్రదర్శించిన నగరాల వివరాలు చూస్తే… ఫీనిక్స్, బే ఏరియా, లాస్ ఏంజిల్స్, డెన్మార్క్, మాంచెస్టర్, అట్లాంటా, చికాగో, డెట్రాయిట్, బోస్టన్, మినిపోలిస్, కాన్సాస్ సిటీ, ఎడిసన్, కొలంబస్, పోర్ట్‌లాండ్, ఫిలడెల్ఫియా, పిట్స్‌బర్గ్, హోస్టన్, వర్జీనియా, సియాటెల్, టొరెంటో నగరాలున్నాయి.
ఇవి కూడా చదవండి :
- 21 దీవులకు 21 సైనికవీరుల పేరు పెట్టిన ప్రధాని మోదీ… 21 మంది కూడా ‘పరమ్ వీర్ చక్ర’ గ్రహీతలు
- గోడలపై మూత్రం పోశారా?.. ఇక అంతే సంగతులు
- రాజమౌళికి జేమ్స్ కేమరూన్ బంపరాఫర్….
- తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని హత్య చేసిన కొడుకు
- మహేశ్ బాబు, జూ.ఎన్టీఆర్, విజయ్ ను కలిసేందుకు వచ్చిన బాలీవుడ్ నిర్మాత
2 Comments