
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా వచ్చే ఎన్నికల కోసం సిద్ధమవుతున్న బిజెపి ఇప్పటినుండే ప్రజా క్షేత్రంలోకి దూసుకు వెళుతుంది. ఉత్తర తెలంగాణాలో పార్టీ కాస్త బలంగానే ఉన్నట్టు భావిస్తున్న బీజేపీ, దక్షిణ తెలంగాణ జిల్లాలలో పార్టీని బలోపేతం చేయడానికి ఫోకస్ చేస్తుంది. ఈ క్రమంలో బిజెపి హై కమాండ్ నేడు, రేపు పార్టీ కార్యవర్గ సమావేశాలను పాలమూరు కేంద్రంగా నిర్వహిస్తోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి సునీల్ బన్సల్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, బిజెపి ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు సహా ఇతర పార్టీ ప్రముఖులు, ఆయా జిల్లాల అధ్యక్షులు ఈ సమావేశాలలో పాల్గొంటున్నారు.
Read Also : హైదరాబాద్ పాతబస్తీలో రెచ్చిపోతున్న రౌడీషీటర్లు..
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి రావాలని దృఢమైన సంకల్పంతో ఉన్న బిజెపి నేతలు నేడు, రేపు జరగనున్న కీలక సమావేశాలలో రాబోయే ఎన్నికల కార్యాచరణకు ప్లాన్ చేస్తున్నారు. పార్టీ బలాబలాలపై నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో చర్చించి వచ్చే ఎన్నికలలో దక్షిణ తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలపై పాలమూరు వేదికగా యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నారని సమాచారం. ఇప్పటికే బీజేపీ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను బలోపేతం చేయడం కోసం గత డిసెంబర్లో 119 నియోజకవర్గాలకు పాలకులను నియమించింది. ఆపై 17 లోక్సభ స్థానాలకు 46 మంది కన్వీనర్ లను, జాయింట్ కన్వీనర్లను, 17 మంది ప్రభారీలను నియమించింది. ఆయా నియోజకవర్గాల వారీగా వారంతా ఏ విధంగా పనిచేస్తున్నారు అన్నదానిపై తాజా కార్యవర్గ సమావేశాలలో సమీక్ష చేయనున్నట్టు సమాచారం.
Also Read : ‘టీడీపీ-జనసేన పొత్తు.. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి’.. కుండబద్దలు కొట్టిన మాజీ మంత్రి
ఇక అంతే కాదు పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో చర్చించి వారికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చి పార్టీని ముందుకు తీసుకు వెళ్లేందుకు దిశా నిర్దేశం చేయనున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు కేంద్రంలో బిజెపి సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత ఎక్కువగా తీసుకువెళ్లడం, అలాగే కేంద్ర సర్కార్ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని, తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఏమి ఇవ్వడం లేదని దుష్ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నేతల ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి మాస్టర్ ప్లాన్ ని కూడా ఈ రెండు రోజుల సమావేశాలలో రూపొందించనున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కృష్ణ జలాల వినియోగంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు నల్గొండ జిల్లా, సహా దక్షిణ తెలంగాణ జిల్లాలకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా ప్రజాక్షేత్రంలో ఎండబెట్టడం కోసం బిజెపి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.
Read Also : రేపు పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటన… భారీగా ఏర్పాట్లు చేస్తున్న జనసేన నేతలు
ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఘనత అని చెప్పుకుంటున్న డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు, రైతు వేదికలు, స్మశాన వాటికలు, క్రీడా మైదానాలు, జాతీయ రహదారులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్ తోనే చేస్తున్నట్టు ప్రజలకు వివరించేలాగా కార్యచరణ రూపొందించనున్నారు. మొత్తంగా చూస్తే వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని, బిఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టడం కోసం, బలహీనంగా ఉన్న స్థానాలపై దృష్టి సారించడానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా బిజెపి ఈ సమావేశాల ద్వారా వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళ్లనున్నట్టు సమాచారం. తెలంగాణా రాష్ట్రంలో ఈ సారి అధికారమే ధ్యేయంగా ఉన్న వేళ బీజేపీ చాలా యాక్టివ్ గా పాలిటిక్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి :
- నల్గొండ బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు… మంత్రి సమక్షంలో ఫైర్ అయిన ఎమ్మెల్యే చిరుమర్తి
- తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని హత్య చేసిన కొడుకు
- మహేశ్ బాబు, జూ.ఎన్టీఆర్, విజయ్ ను కలిసేందుకు వచ్చిన బాలీవుడ్ నిర్మాత
- బ్యాక్ గ్రౌండ్ లేని బ్లాక్ మెయిలర్ , చీటర్ రేవంత్ రెడ్డి-రాజగోపాల్ రెడ్డి
- ప్రగతిభవన్ లో బడ్జెట్ ప్రతిపాదనలపై పై సీఎం కేసీఆర్ సమీక్ష
One Comment