
క్రైమ్ మిర్రర్, ప్రత్యేక ప్రతినిధి : దేశంలో అత్యంత ధనిక రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించింది. రెండో స్థానం తృణమూల్ కాంగ్రెస్‌కు దక్కింది. విరాళాలు సేకరించడంలో కాంగ్రెస్ పార్టీ వెనకబడింది. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన వార్షిక ఆడిట్ నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. రాజకీయ పార్టీల ఆస్తుల లెక్కలను ఎన్నికల సంఘం వెల్లడించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్ దక్కింది. 2021 -22 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి విరాళాల రూపంలో రూ. 1917.12 కోట్లు దక్కాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కమలం పార్టీ ఆస్తుల విలువ రూ. 752.33 కోట్ల రూపాయలే. అయితే ఒకే ఒక్క ఏడాదిలో బీజేపీ ఆస్తులు 155 రెట్లు పెరిగాయి. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సెకండ్ ప్లేస్ దక్కింది. 2021-22 వార్షిక ఏడాదిలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి వివిధ విరాళాల రూపంలో 545.75 కోట్లు అందాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే టీఎంసీ ఆస్తులు 74.42 కోట్లు పెరిగాయి.
Also Read : టాలీవుడ్ లో మరో విషాదం.. యువ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్య
ఐదు దశాబ్దాలకు పైగా కేంద్రంలో అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీ కంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మొత్తంలో ఆస్తులు పోగు చేసుకోవడం విశేషం. జాతీయ పార్టీ కాంగ్రెస్ విషయానికొస్తే 2021-22 వార్షిక ఏడాదిలో ఆ పార్టీ ఆస్తుల విలువ రూ. 541.27 కోట్లు. అయితే 2020-21 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ ఆస్తుల విలువ రూ.285.76 కోట్లు. అలాగే 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరం నాటికి కాంగ్రెస్ ఆస్తుల విలువ 89.4 శాతం పెరిగాయి. రాజకీయ పార్టీలకు అనేక సంస్థల నుంచి, వ్యక్తుల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు అందుతుంటాయి. ఇది సర్వ సాధారణం. అయితే 2021-22 ఆర్థిక సంవత్సంలో వివిధ రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో సింహభాగం బీజేపీకే దక్కాయి. మొత్తం విరాళాల్లో 58 శాతం బీజేపీకే అందాయి. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో రాజకీయ పార్టీలకు విరాళాలు అందుతుంటాయి. 2018 జనవరి రెండో తేదీన ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఎలక్టోరల్ బాండ్ లో చెల్లింపుదారుడి పేరు అలాగే కొనుగోలుదారుడి పేరు ఏమీ ఉండవు. ప్రజా ప్రాతినిథ్య చట్టం -1951 సెక్షన్ 29 ఏ కింద నమోదైన రాజకీయ పార్టీలు మాత్రమే ఎలక్టోరల్ బాండ్స్ పొందడానికి అర్హత కలిగి ఉంటాయి.
ఇవి కూడా చదవండి :
- ఒకే రోజు, ఒకే సమయం, 25 నగరాల్లో వాల్తేర్ వీరయ్య ప్రదర్శన.. అమెరికాలో సూపర్ సక్సెస్
- నిర్మల్ జిల్లా బాసరలో విషాదం… ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలో దూకిన తల్లి
- 21 దీవులకు 21 సైనికవీరుల పేరు పెట్టిన ప్రధాని మోదీ… 21 మంది కూడా ‘పరమ్ వీర్ చక్ర’ గ్రహీతలు
- గోడలపై మూత్రం పోశారా?.. ఇక అంతే సంగతులు
- రాజమౌళికి జేమ్స్ కేమరూన్ బంపరాఫర్….
One Comment