
క్రైమ్ మిర్రర్, నకిరేకల్ : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలలో లుకలుకలు అన్ని పార్టీలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఒకే నియోజవర్గంలో టికెట్ ఆశిస్తున్న పలువురు నేతల మధ్య వర్గపోరు పార్టీలకు తలనొప్పిగా మారుతోంది. కొందరు నేతలు బాహాటంగానే తమ అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. మరికొందరు ఒకడుగు ముందుకేసి వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకే వస్తుందని.., కాబోయే ఎమ్మెల్యేను నేనే అని చెప్పుకుంటున్నారు. దీంతో పార్టీ కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. ఇదిలా ఉండగా.. సొంత పార్టీ నేతల మధ్య వైరంతో పార్టీ గెలుపు అవకాశాలు దెబ్బతిని ప్రత్యర్థి పార్టీలకు కలిసొచ్చే అవకాశం ఉందని పలు పార్టీల అధినాయకత్వం కలవరపాటుకు గురువుతున్నారు.
Read Also : ప్రమాదకర వీడియో వైరల్.. వామ్మో మరీ ఇంత ధైర్యమా?
తాజాగా.. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజవర్గంలోని అధికార బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాడు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై ప్రస్తుత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలోనే ఆయన ఈ విమర్శలు చేయటం జిల్లాలో ఇప్పుడు హాట్ టాఫికగా మారింది. నియోజవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.. వేముల వీరేశంను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్లుగా వీరేశంకు బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వమే లేదని అన్నారు. ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశాడు. ‘గత నాలుగున్నరేళ్లుగా రోజుకో సన్నివేశం వేస్తున్నారు. నేను ఏ రోజు మాట్లాడలేదు. ఇవాళ మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా.
Also Read : అల్లాపూర్ డివిజన్ లో ఎమ్మెల్యే మాధవరం పర్యటన
నాకు మంత్రి గారికి గ్యాప్ వచ్చిందని ఓ రోజు చెబుతారు. ఓ రోజేమో నాకే ఎమ్మెల్యే టికెట్ వస్తుందని చెబుతాడు. మరో రోజేమో.. నాకు ఎమ్మెల్సీ ద్వారా మంత్రి పదవి వస్తుందని చెబుతాడు. నిన్న మెున్ననేమో ఎంపీని అయితా అని చెప్పుకుంటుండు. గత నాలుగేళ్లు అయితుంది పార్టీలో సభ్యత్వం లేక. ఎక్కడుంటుండో, ఏం సంగతో తెలియని పరిస్థితి. నువ్వు ఏం చేస్తున్నవో తెలియక నీ అనుచర వర్గం కన్ఫ్యూజ్ అవుతున్నరు. ఓ రోజు ఖమ్మం పార్టీ అంటవ్, ఓ రోజు మిర్యాలగూడ పార్టీ అంటవ్, ఇంకోరోజు మహబూబ్‌నగర్ పార్టీ అంటవ్. ఇంత కన్ఫ్యూజన్ ఉండి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తే.. ప్రజలు ఊరుకోరు. నకిరేకల్ ప్రజలు చైతన్యవంతులు.
Read Also : విశాఖలో ఏఆర్ కానిస్టేబుల్ దందా.. ప్రేమికుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వైనం !!!
గతంలో ఏం అభివృద్ధి జరిగిందో ప్రజలకు తెలుసు. ఇవాళ కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న. మెున్ననే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి రూ.25 కోట్ల నిధులు తీసుకొని వచ్చిన.’ అని చిరుమర్తి లింగయ్య వేముల వీరేశం టార్గెట్‌గా విమర్శలు చేశారు. అయితే 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన వేముల వీరేశం 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చిరుమర్తి లింగయ్య.. తదనంతర రాజకీయ పరిణామాల మధ్య బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఎవరికి వారు కార్యక్రమాలను నిర్విహిస్తూ.. నియోజవర్గంలో కేడర్‌ను గందరగోళానికి గురి చేస్త్తున్నారు. తాజాగా.. ఎమ్మెల్యే చిరుమర్తి చేసిన కామెంట్స్ నల్గొండ బీఆర్ఎస్‌లో కాక రేపుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
- అదృశ్యమైన ఏడాది బాలుడు మృతి..తల్లికి ముందే తెలిసినా..
- టెక్సాస్ భారతీయ ఆలయంలో దొంగల బీభత్సం !
- తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని హత్య చేసిన కొడుకు
- బ్యాక్ గ్రౌండ్ లేని బ్లాక్ మెయిలర్ , చీటర్ రేవంత్ రెడ్డి-రాజగోపాల్ రెడ్డి
- కోమటిరెడ్డిని టార్గెట్ చేసిన కొండా! రేవంత్ రెడ్డి దెబ్బ మాములుగా లేదుగా…
One Comment