
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటనకు షెడ్యూల్ ఖరారు అయింది. ఈ నెల 24న తెలంగాణ పర్యటనకు పవన్ కల్యాణ్ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని పవన్ దర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. దీంతో పాటు వారాహి వాహనాలకు వాహన పూజలు చేయించనున్నారు. ఈ పర్యటన షెడ్యూల్‌ను జనసేన పార్టీ విడుదల చేసింది. 24వ తేదీ ఉదయం హైదరాబాద్ నుంచి పవన్ బయలుదేరి 11 గంటలకు కొండగట్టుకు చేరుకోనున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం వారాహి వాహనాలకు పూజలు చేయించనున్నారు.
Read Also : నల్గొండ బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు… మంత్రి సమక్షంలో ఫైర్ అయిన ఎమ్మెల్యే చిరుమర్తి
ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కొడిమ్యాల మండలం నాచుపల్లిలో జనసేన ముఖ్యనేతల సమావేశం నిర్వహించనున్నారు. నాచుపల్లి శివారులోని బృందావన్ రిసార్ట్‌లో ఈ సమావేశం జరగనుంది. తెలంగాణలో జనసేన పార్టీ కార్యాచరణ, వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత పవన్ ధర్మపురి వెళ్లనున్నారు. ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహక్షేత్రంలో పూజలు చేసి అనుష్టుమ్ నారసింహ యాత్రను మొదలుపెట్టనున్నారు. ఈ యాత్రలో భాగంగా 32 నారసింహ క్షేత్రాలను పవన్ సందర్శించనున్నారు. ఏపీ రాజకీయాలకే పరిమితమైన పవన్.. తెలంగాణలో పర్యటించి చాలా రోజులైంది. చాలాకాలం తర్వాత పవన్ తెలంగాణలో పర్యటిస్తుండటంతో.. రాష్ట్ర జనసేన పార్టీ వర్గాల్లో జోష్ నెలకొంది.
Also Read : అల్లాపూర్ డివిజన్ లో ఎమ్మెల్యే మాధవరం పర్యటన
ఈ పర్యటనను సక్సెస్ చేసేందుకు జనసేన నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ నేతలతో జరగనున్న సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, జనసేన వ్యూహంపై పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశముంది. తెలంగాణలో కూడా జనసేన పోటీ చేస్తుందని ఇటీవల పవన్ ప్రకటించారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేది రాష్ట్ర నేతలే నిర్ణయించుకోవాలని సూచించారు. 7 లేదా 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలా? అనేది నేతలు నిర్ణయించుకుని చెప్పాలని సూచించారు.
Read Also : అదృశ్యమైన ఏడాది బాలుడు మృతి..తల్లికి ముందే తెలిసినా..
రెండు లేదా మూడు లోక్‌సభ స్ధానాల్లో బరిలోకి దిగుతామని గతంలో స్పష్టం చేశారు. కొండగట్టు నుంచి తాను తెలంగాణ రాజకీయాలను ప్రారంభిస్తానంటూ పవన్ తెలిపారు. కొండగట్టుతో పవన్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. తెలంగాణ నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా.. కొండగట్టు నుంచే పవన్ ప్రారంభిస్తారు. గతంలో కూడా అనే కార్యక్రమాలను కొండగట్టు నుంచే మొదలుపెట్టారు. ఇప్పుడు వారాహికి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి ఆ సెంటిమెంట్‌ను పవన్ కొనసాగించనున్నారు. ఈ పర్యటన తర్వాత ఏపీతో పాటు తెలంగాణ రాజకీయాల్లో పవన్ స్పీడ్ పెంచనున్నారని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరింతగా పవన్ ప్రజల్లోకి వెళతారని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- విశాఖలో ఏఆర్ కానిస్టేబుల్ దందా.. ప్రేమికుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వైనం !!!
- టెక్సాస్ భారతీయ ఆలయంలో దొంగల బీభత్సం !
- చంద్రబాబు, లోకేశ్ లకు ప్రాణహాని -బుద్దా వెంకన్న
- మావోయిస్టు నేత గాజర్ల రవిపై రూ.10 లక్షల రివార్డు…. మరో ముగ్గురిపై ప్రకటించిన ఎన్‌ఐఏ
- వరల్డ్ టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో మంత్రి కేటీఆర్
One Comment