
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఆయన. టెర్మినేటర్, టైటానిక్, అవతార్ వంటి సినిమాలను తీసి ప్రపంచంలోనే నెంబర్ వన్ దర్శకుడిగా ఉన్నారాయన. ఎంతో మంది దర్శకులకు ఇన్స్పిరేషన్ ఆయనే. ఎప్పటికైనా ఆయనలాగా సినిమాలు తీయాలని డైరెక్టర్లు భావించే వ్యక్తి. మరి అంతటి గొప్ప వ్యక్తి మన టాలీవుడ్ డైరెక్టర్ పై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు హాలీవుడ్ సినిమాలు చేయాలంటే చెప్పండి.. మాట్లాడుకుందాం అంటూ ఆఫర్ కూడా ఇచ్చారు. ఆ హాలీవుడ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కేమరూన్ అయితే ఆ ఆఫర్ అందుకున్న దర్శకుడు రాజమౌళి.
Read Also : జీవో నెంబర్ 317 అనైతికమని వ్యాఖ్య… కేసీఆర్ ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్
ఇదంతా లాస్ ఏంజిలిస్‌లో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ సందర్భంగా జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్ఆర్ఆర్ టీమ్ నెట్టింట్లో రిలీజ్ చేసింది. తన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన జేమ్స్ కేమరూన్ మన రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు. ఆన రెండోసారి భార్యతో కలిసి సినిమా చూశానని చెప్పారు. కేమరూన్ సినిమాలన్నీ చూశానని.. ఆయనే ఇన్ స్పిరేషన్ అని రాజమౌళి చెప్పారు. ఈ సందర్భంగా కేమరూన్ మాట్లాడుతూ .. మీ సినిమాలు చూస్తుంటే ఎంతసేపైనా చూడాలనిపిస్తుందని చెప్పారు. అలాగే మీరు స్టోరీ చెప్పే విధానం బాగుంటుంది.
Also Read : హైదరాబాద్ పాతబస్తీలో రెచ్చిపోతున్న రౌడీషీటర్లు..
ఫైర్ , వాటర్ తో క్యారెక్టర్స్ పరిచయం చేయడం ఆసక్తి కలిగించింది. క్యారెక్టర్స్ తో పాటు ట్విస్టులు, టర్న్ లు ..వాళ్ల స్నేహం ఇలాంటివన్నీ బాగున్నాయి. .. అని అన్నారు. ఇక ఫైనల్ గా మీరు ఎప్పుడైనా హాలీవుడ్ సినిమా చేయాలనుకుంటే నాతో చెప్పండి.. మాట్లాడుకుందాం అంటూ ఆఫర్ ఇచ్చారు. కేమరూన్ మాటలతో రాజమౌళి ఆనందంగా ఫీలయ్యారు. మీ మాటలు వింటుంటే అవార్డు వచ్చిన దాని కంటే చాలా ఆనందంగా ఉందని చెప్పారు. సినిమా చూడటమే కాకుండా దాన్ని గొప్పగా విశ్లేషించడం నమ్మలేకపోతున్నానని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
- పాలమూరు వేదికగా బీజేపీ బడా స్కెచ్.. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో ఎన్నికల రోడ్ మ్యాప్!!
- ‘టీడీపీ-జనసేన పొత్తు.. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి’.. కుండబద్దలు కొట్టిన మాజీ మంత్రి
- రేపు పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటన… భారీగా ఏర్పాట్లు చేస్తున్న జనసేన నేతలు
- నల్గొండ బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు… మంత్రి సమక్షంలో ఫైర్ అయిన ఎమ్మెల్యే చిరుమర్తి
- మహిళా ఐఏఎస్ అధికారి ఇంట్లోకి చొరబడ్డ డిప్యూటీ తహసిల్దార్.. అరెస్టు చేసిన పోలీసులు
One Comment