
క్రైమ్ మిర్రర్, హైద్రాబాద్ ప్రతినిధి : హైదరాబాద్ పాతబస్తీలో రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు. రోజురోజుకి వారి ఆగడాలు మితిమీరుతున్నాయి. వారి మాట వినని వారిని రోడ్డుపైనే వెంటాడి వెంటాడి దాడులకు తెగబడుతున్నారు. . కత్తుల, రాడ్లు, కర్రలతో దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నారు. రౌడీషీటర్ల అరాచకాలతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు.. రౌడీషీటర్ల మధ్య ఆధిపత్య పోరుతో తాము చెప్పినట్లు గ్యాంగ్‌లోని యువకులను కిడ్నాప్ చేసి బంధిస్తున్నారు. కత్తులతో బెదిరించి వారిచే నగ్నంగా డ్యాన్సులు చేయిస్తున్నారు. చంద్రాయణ్ గుట్టలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడిని బంధించిన కొందరు రౌడీ షీటర్లు.. అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు.
Read Also : ‘టీడీపీ-జనసేన పొత్తు.. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి’.. కుండబద్దలు కొట్టిన మాజీ మంత్రి
అతడి బట్టలు విప్పించి నగ్నంగా డ్యాన్సులు చేయించారు. అనంతరం ఫోన్‌లో ఆ దృష్యాలను రికార్డు చేసి.., సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు దిగారు. వారి ఆగడాలు తట్టుకోలేని సదరు యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్‌లో ఆదివారం పట్టపగలే దారుణ హత్య జరిగింది. నగరంలోని కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని పట్టపగలే అతి దారుణంగా హత్య చేశారు దుండగులు. జియాగూడ రోడ్డుపైన.. అందరూ చూస్తుండగానే.. ఒక వ్యక్తిని ముగ్గురు దుండగులు.. కొడవలి, కత్తి, ఇనుపరాడ్‌తో విచక్షణారహితంగా దాడి చేశారు. బాధితుడు సాయం కోసం కేకలు వేస్తూ.. పరుగెత్తాడు. అయినా వదలకుండా వెంటపడి మరి వేటాడారు. కత్తితో ముఖం, చేతులు, కాళ్లు, పొట్ట భాగంలో విచక్షణా రహితంగా నరికారు. రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడు చనిపోయాడని నిర్ధారించుకుని దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.
Also Read : రేపు పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటన… భారీగా ఏర్పాట్లు చేస్తున్న జనసేన నేతలు
స్థానికుల సమాచారంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. హత్యకు గురైన వ్యక్తి అంబర్‌పేట బతుకమ్మ కుంట వాసి అయిన సాయినాథ్‌గా గుర్తంచారు. ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధం కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాయినాథ్ సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా అనుమానితులను ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. సీసీ పుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇలా పట్టపగలు, నడిరోడ్డుపై రౌడీషీటర్లు రెచ్చిపోతుండటంతో నగర వాసులు భయాందోళలకు గురవుతున్నారు. నగరంలో చాలా చోట్ల యథేచ్చగా కత్తులతో దాడులు చేస్తుండటం పట్టణ ప్రజలను కలవరపాటుకు గురి చేస్తోంది. పోలీసులు ఎన్ని కఠినా చర్యలు తీసుకుంటున్నా.. రౌడీషీటర్లు ఎలాంటి భయం లేకుండా మర్డర్లు చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- నల్గొండ బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు… మంత్రి సమక్షంలో ఫైర్ అయిన ఎమ్మెల్యే చిరుమర్తి
- టెక్సాస్ భారతీయ ఆలయంలో దొంగల బీభత్సం !
- మహిళా ఐఏఎస్ అధికారి ఇంట్లోకి చొరబడ్డ డిప్యూటీ తహసిల్దార్.. అరెస్టు చేసిన పోలీసులు
- మావోయిస్టు నేత గాజర్ల రవిపై రూ.10 లక్షల రివార్డు…. మరో ముగ్గురిపై ప్రకటించిన ఎన్‌ఐఏ
- అదృశ్యమైన ఏడాది బాలుడు మృతి..తల్లికి ముందే తెలిసినా..
One Comment