
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : టీచర్ల బదిలీ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. సొంత రాష్ట్రం తెలంగాణలో ఉపాధ్యాయులు పరాయి బ్రతుకు బతకాల్సి వచ్చిందని అన్నారు. జీవో నెంబర్ 317 ద్వారా ఉపాధ్యాయుల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించటం బాధకరమన్నారు. కేసీఆర్‌ను ప్రగతి భవన్ నుంచి బయటకు లాగే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఆ జీవో 317కు వ్యతిరేకంగా తాము పోరాడతామని బండి సంజయ్ స్పష్టం చేశారు. ‘317 జీవో ముఖ్యమంత్రి కేసిఆర్ అనాలోచిత నిర్ణయం. ఈ జీవోకు వ్యతిరేకంగా మేం అనేక ఉద్యమాలు చేపట్టాం. ఈ జీవోతో ఉద్యోగుల జీవితాలను చిన్నాభిన్నం చేశారు.
Also Read : పాలమూరు వేదికగా బీజేపీ బడా స్కెచ్.. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో ఎన్నికల రోడ్ మ్యాప్!!
స్వరాష్ట్రంలో స్థానికత కోసం టీచర్లు పోరాడే పరిస్థితి వచ్చింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆనాడు ఉద్యమం చేయకుంటే తెలంగాణ వచ్చేదా ? కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడా ? ఆనాడు పరాయి రాష్ట్రంలో పోరాడిన వారే నేడు స్వరాష్ట్రంలో స్థానికత కోసం పోరాడుతున్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న ఉపాధ్యాయులను పోలీసులతో అరెస్టు చేయించారు. చంటి పిల్లలను చూడకుండా కర్కషంగా వ్యవహరించారు. ఆ దృశ్యాలు హృదయవిదారకం. ఉపాధ్యాయులను అమానుషంగా అరెస్టు చేశారు. బదిలీలు, ప్రమోషన్ల పేరుతో మళ్లీ కొత్త పంచాయతీ పెట్టారు. 10 జిల్లాలో స్పౌజ్ బదిలీలు ఆపేశారు. ప్రభుత్వ విధానాల వల్ల దాదాపు 34 మంది ఉపాధ్యాయులు చనిపోయారు. 2 వేల మంది టీచర్ దంపతులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం జీతాలు కూడా ఇవ్వకుండా వారిని ఇబ్బందులు పెడుతున్నారు.
Read Also : హైదరాబాద్ పాతబస్తీలో రెచ్చిపోతున్న రౌడీషీటర్లు..
పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరు. వారికి డీఏ ఎందుకు ఇవ్వరు ? కేంద్రంతో పోల్చుకునే కేసీఆర్.. ఉపాధ్యాయులకు నాలుగు డీఏలు ఎందుకు ఇవ్వటం లేదు. పీఆర్సీ లేదు, డీఏలు లేవు పైగా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏనాడు వారు జీతాల కోసం రోడ్కెక్కలేదు. సమస్యను సృష్టించి పరిష్కారం చేయకుండా సీఎం కేసీఆర్ రాక్షస ఆనందం పొందుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులు మళ్లీ సకల జనుల సమ్మె చేస్తరు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. జీవో 317 పై టీచర్ల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాలి. ఈ జీవోతో టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ జీవోపై ముఖ్యంత్రి స్పందించే వరకు బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది. రేపు రాష్ట్రకార్యవర్గ సమావేశాల్లోనూ ఈ అంశంపై చర్చిస్తాం. మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ జీవోకు వ్యతిరేకంగా అనేక సందర్భాల్లో పోరాడారు.’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
ఇవి కూడా చదవండి :
- ‘టీడీపీ-జనసేన పొత్తు.. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి’.. కుండబద్దలు కొట్టిన మాజీ మంత్రి
- నల్గొండ బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు… మంత్రి సమక్షంలో ఫైర్ అయిన ఎమ్మెల్యే చిరుమర్తి
- రేపు పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటన… భారీగా ఏర్పాట్లు చేస్తున్న జనసేన నేతలు
- విశాఖలో ఏఆర్ కానిస్టేబుల్ దందా.. ప్రేమికుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వైనం !!!
- టెక్సాస్ భారతీయ ఆలయంలో దొంగల బీభత్సం !
One Comment