
క్రైమ్ మిర్రర్, నిర్మల్ జిల్లా ప్రతినిధి : నిర్మల్ జిల్లా బాసరలో విషాదం చోటు చేసుకుంది. తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ తల్లి గోదావరిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. మృతులు నిజామాబాద్‌కు చెందిన మానస (27), కుమారుడు బాలాదిత్య (8), కుమార్తె నవ్యశ్రీ (7)గా పోలీసులు గుర్తించారు. నిజామాబాద్ నుంచి తన ఇద్దరు పిల్లలతో కలిసి బాసరకు బస్సులో వచ్చిన మానస గోదావరి వంతనె వద్ద దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గోదావరి నది వద్ద గంగా హారతి ఇచ్చి ఘాట్ సమీపంలో పిల్లల స్కూల్ బ్యాగులు, ఖాలీగా ఉన్న టిఫిన్ బాక్సులను పోలీసులు గుర్తించారు.
Read Also : 21 దీవులకు 21 సైనికవీరుల పేరు పెట్టిన ప్రధాని మోదీ… 21 మంది కూడా ‘పరమ్ వీర్ చక్ర’ గ్రహీతలు
పిల్లలకు భోజనం తినిపించిన తర్వాత వారితో కలిసి తల్లి మానస గోదావరిలోకి దూకినట్లుగా తెలుస్తోంది. ఘాట్ సమీపంలో స్కూలు బ్యాగులు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను బయటకు తీశారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కుటుబం కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు.
ఇవి కూడా చదవండి :
- గోడలపై మూత్రం పోశారా?.. ఇక అంతే సంగతులు
- రాజమౌళికి జేమ్స్ కేమరూన్ బంపరాఫర్….
- జీవో నెంబర్ 317 అనైతికమని వ్యాఖ్య… కేసీఆర్ ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్
- పాలమూరు వేదికగా బీజేపీ బడా స్కెచ్.. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో ఎన్నికల రోడ్ మ్యాప్!!
- రేపు పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటన… భారీగా ఏర్పాట్లు చేస్తున్న జనసేన నేతలు
One Comment