
క్రైమ్ మిర్రర్, అమరావతి ప్రత్యేక ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ పొత్తుల రాజకీయ ఆసక్తి రేపుతోంది. ప్రధానంగా టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖాయమని కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు కూడా రెండుసార్లు భేటీ కావడంతో రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం పక్కా అని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్. చంద్రబాబు, పవన్‌లు మాత్రం అధికారికంగా పొత్తుపై ఏమీ మాట్లాడటం లేదు. తుది నిర్ణయం అధినేతలే తీసుకుంటారని రెండు పార్టీల నేతలు చెప్పే మాట. ఇదిలా ఉంటే కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య పేరుతో ఓ లేఖ వైరల్ అవుతోంది.
Read Also : రేపు పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటన… భారీగా ఏర్పాట్లు చేస్తున్న జనసేన నేతలు
టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ఆయన కీలకమైన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఓడించాలంటే పొత్తు ఉండాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. కాపు సంక్షేమ సేన ఆకాంక్ష, డిమాండ్ అన్నారు. కాపు సంక్షేమ సేన ఆవిర్భవించిందే రెండు ఆశయాలను నెరవేర్చడం కోసమేనని.. విద్యా, ఉద్యోగాలలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులకు ప్రస్తుతం బీసీలుగా ఉన్న సామాజిక వర్ణాలకు ఎటువంటి నష్టం కలుగకుండా రిజర్వేషన్స్ దక్కించుకోవడం మొదటి ఆశయం అన్నారు. అయితే రాష్ట్ర జనాభాలో 22శాతం జనాభా ఉన్న కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం దక్కాలని.. అంటే ముఖ్యమంత్రి దక్కాలనన్నారు. విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్స్ దక్కించుకోవటమే ధ్యేయంగా కాపుసేన అనేక ఉద్యమాలు, దీక్షలు చేస్తూ వస్తోంది అన్నారు.
Also Read : నల్గొండ బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు… మంత్రి సమక్షంలో ఫైర్ అయిన ఎమ్మెల్యే చిరుమర్తి
త్వరలో కోర్టు తలుపులు తట్టబోతుందన్నారు. ఈ డిమాండు సాధించుకోవడానికి కాపు కులస్తులను ఎవరికీ తాకట్టు పెట్టకూడదనేదే కాపు సంక్షేమ సేన విధి విధానాలుగా చెప్పుకొచ్చారు. రెండవది కాపు కులస్తులకు ముఖ్యమంత్రి పదవి దక్కటం, పరిపాలన చేపట్టడం అన్నారు హరిరామ జోగయ్య. బడుగు బలహీనవర్లాల సంక్షేమం కోరి ప్రజారాజ్యం ఏర్పాటు చేయటం.. బడుగు బలహీనవర్గాలను అధికారంలో భాగస్వాములను చేయటం.. ఈ కోరికను సాధించటమే ధ్యేయంగా జనసేన పార్టీకి కాపు సంక్షేమ సేనను అనుబంధంగా తీర్చిదిద్దబం జరిగింది అన్నారు. పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రిగా చేయటమే కాపు సంక్షేమ సేన ప్రధాన లక్ష్యమన్నారు.
Read Also : విశాఖలో ఏఆర్ కానిస్టేబుల్ దందా.. ప్రేమికుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వైనం !!!
రాక్షసపరిపాలన, అభివృద్ధిరహిత పరిపాలన, అవినీతి పరిపాలన సాగిస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేతను రాబోయే ఎన్నికలలో ఓడించటం ఒక్కటే జనసేన పార్టీ లక్ష్యం కాదని.. పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేయటం ద్వారా బడుగు ఐలహీన వర్షాల రాజ్యం ఏర్పాటు చేయటమే కాపు సంక్షేమ సేన ముఖ్య ఆశయంగా లేఖలో ప్రస్తావించారు. ఈ రెండవ ఆశయసాధనకు ‘బడుగు బలహీనవర్గాల వారందరూ కలిసి జనసేనతో పనిచేయాలని అవినీతిరహిత -పరిపాలనకు దొహదం చేయాలంటే సరికొత్త పరిపాలన కోరుకోవాలని ఆశిస్తున్నట్లు లేఖలో రాశారు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి :
- మావోయిస్టు నేత గాజర్ల రవిపై రూ.10 లక్షల రివార్డు…. మరో ముగ్గురిపై ప్రకటించిన ఎన్‌ఐఏ
- రాముడు, సీతతో కలిసి మధ్యాహ్నమే మద్యం తాగేవాడు!
- వరల్డ్ టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో మంత్రి కేటీఆర్
- సీటు బెల్టు పెట్టుకోకుండా రిషీ సునాక్ ప్రయాణం.. వంద పౌండ్ల జరిమానా !
- గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న నాటు నాటు సాంగ్.. అవార్డు తీసుకున్న తొలి ఆసియా చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డు
4 Comments