
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. యువనటుడు ఆత్మహత్య చేసుకోవడం సినీ పరిశ్రమలో విషాదం నింపింది. నటుడు సుధీర్ వర్మ బలవన్మరణం చెందాడు. విశాఖలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. కుందనపు బొమ్మ, సెకండ్ హ్యాండ్, షూటౌట్ ఎట్ ఆలేరు వంటి చిత్రాల ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. సుధీర్ మృతి విషయాన్ని కుందనపు బొమ్మ సినిమాలో ఆయనతో కలిసి నటించిన సుధాకర్ కోమాకుల సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. సుధీర్ మృతి దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. దాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పారు. సుధీర్ వ్యక్తిగత కారణాలతో విషం తీసుకుని చనిపోయినట్టు తెలుస్తోంది. చాలా రోజుల నుంచి సుధీర్ మానసికంగా బాధపడుతున్నారని చివరకు ఇవాళ ప్రాణాలు తీసుకున్నారని అంటున్నారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీ నటులు సుధీర్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.
ఇవి కూడా చదవండి :
- ఒకే రోజు, ఒకే సమయం, 25 నగరాల్లో వాల్తేర్ వీరయ్య ప్రదర్శన.. అమెరికాలో సూపర్ సక్సెస్
- నిర్మల్ జిల్లా బాసరలో విషాదం… ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలో దూకిన తల్లి
- 21 దీవులకు 21 సైనికవీరుల పేరు పెట్టిన ప్రధాని మోదీ… 21 మంది కూడా ‘పరమ్ వీర్ చక్ర’ గ్రహీతలు
- గోడలపై మూత్రం పోశారా?.. ఇక అంతే సంగతులు
- ఇతర క్యారెట్ల కంటే బ్లాక్ క్యారెట్ లో బోలెడు పోషకాలు.. అవేంటో తెలుసా?
One Comment