
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : విశాఖలోని ఏఆర్ కానిస్టేబుల్ దందా బట్టబయలైంది. నకిలీ పోలీసుతో ప్రేమికులే టార్గెట్ గా డబ్బులు వసూలు చేయిస్తున్న వైనం బయటకొచ్చింది. దీంతో ఏఆర్ కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం దిశ మొబైల్ వాహనంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు సంతోష్. కొన్నాళ్లుగా ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు పర్యాటక ప్రాంతాల్లో ఏకాంతంగా ఉండే ప్రేమికుల నుంచి డబ్బులు వసూలు చేయడానికి ఓ వ్యక్తిని నియమించాడు. నకిలీ కానిస్టేబుల్ అవతారమెత్తిన ఆ వ్యక్తి.. నిత్యం ఖాకీ ప్యాంటు ధరించి ప్రేమికుల్ని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడు.
Read More : ఇతర క్యారెట్ల కంటే బ్లాక్ క్యారెట్ లో బోలెడు పోషకాలు.. అవేంటో తెలుసా? –
రెండ్రోజుల క్రితం ఇదే తరహాలో ప్రేమికుల నుంచి డబ్బులు వసూలు చేస్తుండగా అసలైన ఆరిలోవ పోలీసులకు చిక్కాడు. ఆయన్ను టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అప్పగించారు. వారు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. కానిస్టేబుల్ సంతోషే తనతో ఈ పని చేయిస్తున్నాడని, తాను ధరించిన ఖాకీ ప్యాంటు కూడా ఆయనదేనని తేలింది. ఏళ్ల తరబడి తాను వసూలు చేస్తున్న మొత్తాన్ని కొంత మినహాయించుకుని సంతోష్‌కు ఫోన్ పే చేస్తున్నానని చెప్పాడు. దీంతో సంతోష్‌పై ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేశారు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఫోన్ పే లెక్కలు చూడగా రూ.లక్షల్లో వసూలు చేసినట్టు బయటపడింది. దీంతో శనివారం సంతోష్‌ను సీఆర్‌పీసీ 41ఏ నోటీసుల ప్రకారం అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి :
-
చైనాలో కరోనా విజృంభణ.. ఇప్పటికే 80 శాతం మందికి వైరస్
-
మహేశ్ బాబు, జూ.ఎన్టీఆర్, విజయ్ ను కలిసేందుకు వచ్చిన బాలీవుడ్ నిర్మాత
-
మావోయిస్టు నేత గాజర్ల రవిపై రూ.10 లక్షల రివార్డు…. మరో ముగ్గురిపై ప్రకటించిన ఎన్‌ఐఏ –
-
బ్యాక్ గ్రౌండ్ లేని బ్లాక్ మెయిలర్ , చీటర్ రేవంత్ రెడ్డి-రాజగోపాల్ రెడ్డి
-
టెక్సాస్ భారతీయ ఆలయంలో దొంగల బీభత్సం ! –
2 Comments