
క్రైమ్ మిర్రర్, సినిమా డెస్క్ : తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా టాలీవుడ్ కు మంచి గౌరవం లభిస్తుంది. పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు కురిపించడంతో మన హీరోలకి కూడా క్రేజ్ పెరిగింది. మరోవైపు బాలీవుడ్ సినిమాలు వరుసగా ఫ్లాప్ లను రుచిచూస్తున్నాయి. పెద్ద పెద్ద హీరోల సినిమాలు సైతం బాక్సాఫీసు దగ్గర చతికిలపడడంతో అక్కడి నిర్మాతలు సైతం తెలుగు హీరోల వైపు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ నిర్మాత ఒకరు హైదరాబాద్ వచ్చారని.. మన తెలుగు హీరోలతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. క్రేజీ స్టార్స్ మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండలను కలిసేందుకు బాలీవుడ్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ హైదరాబాద్ వచ్చారట.
Read More : మహిళా ఐఏఎస్ అధికారి ఇంట్లోకి చొరబడ్డ డిప్యూటీ తహసిల్దార్.. అరెస్టు చేసిన పోలీసులు –
భవిష్యత్తులో ఈ టాలీవుడ్ స్టార్స్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లను లైన్ లో పెట్టాలనే ఆలోచనలో ఆయన ఇక్కడికి వచ్చారని సమాచారం. తెలుగు హీరోలతో తెలుగు సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో తీయాలనుకుంటున్నారట భూషణ్ కుమార్. ఈ నిర్మాత ఇప్పటికే ప్రభాస్ తో సాహో, రాధేశ్యామ్ వంటి చిత్రాలు నిర్మించారు. కాబట్టి ఆయన టాలీవుడ్ కు కొత్తేమీ కాదు. ప్రస్తుతం తెలుగు సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో గ్లోబల్ లెవెల్లో తెలుగు సినిమాలు తీయడానికి పెద్ద పెద్ద నిర్మాతలు సైతం ఆసక్తి చూపుతున్నారు. అందుకే భూషణ్ కుమార్ కూడా తెలుగు హీరోలతో సినిమా తీసి క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి …
-
రాముడు, సీతతో కలిసి మధ్యాహ్నమే మద్యం తాగేవాడు! –
-
భట్టి పదవికి రేవంత్ రెడ్డి ఎసరు? –
-
బ్యాక్ గ్రౌండ్ లేని బ్లాక్ మెయిలర్ , చీటర్ రేవంత్ రెడ్డి-రాజగోపాల్ రెడ్డి –
-
కోమటిరెడ్డిని టార్గెట్ చేసిన కొండా! రేవంత్ రెడ్డి దెబ్బ మాములుగా లేదుగా… –
-
నేను ఎవరికీ అనుకూలం కాదు.. అధిష్టానం చెప్పింది చేయడమే నా విధి-మాణిక్ రావు ఠాక్రే –
One Comment