
క్రైమ్ మిర్రర్, తెలంగాణ డెస్క్ : తెలంగాణలో కీలక పదవిలో ఉన్న ఓ మహిళ ఐఏఎస్ అధికారి ఇంట్లోకి మేడ్చల్ జిల్లాకు చెందిన డిప్యూటీ తహసిల్దార్ చొరబడ్డాడు. అనుమతి లేకుండా ఇంట్లోకి రావడంపై అప్రమత్తమైన అధికారిణి కేకలు వేయడంతో సెక్యూరిటీ సిబ్బంది డిప్యూటీ తహసిల్దార్ ని పోలీసులకు అప్పగించారు. జూబ్లీహిల్స్‌లో మేడ్చల్ జిల్లాకు చెందిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్‌కుమార్‌రెడ్డి హంగామా చేశాడు. అర్థరాత్రి వేళ మహిళా ఐఏఎస్ అధికారి ఇంట్లోకి డిప్యూటీ తహసీల్దార్ చొరబడ్డాడు.
Read More : బ్యాక్ గ్రౌండ్ లేని బ్లాక్ మెయిలర్ , చీటర్ రేవంత్ రెడ్డి-రాజగోపాల్ రెడ్డి –
గేటెడ్ కమ్యూనిటీ లో ఉన్న మహిళా ఐఏఎస్ అధికారి ఇంటికి వెళ్ళిన మేడ్చల్ జిల్లాకు చెందిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ రెడ్డి.. పదోన్నతి విషయంలో మాట్లాడేందుకు వచ్చానని చెప్పాడు. అనుమతి లేకుండా రావడంపై అధికారిణి అరవడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. గతంలో మహిళ ఐఏఎస్ అధికారి ట్వీట్స్ ను డిప్యూటీ తహసీల్దార్ రీ ట్వీట్ చేశాడు. డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్‌రెడ్డిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు సెక్యూరిటీ సిబ్బంది. డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్‌రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనను పోలీసు అధికారులు గోప్యంగా ఉంచారు.
ఇవి కూడా చదవండి …
-
రాముడు, సీతతో కలిసి మధ్యాహ్నమే మద్యం తాగేవాడు! –
-
భట్టి పదవికి రేవంత్ రెడ్డి ఎసరు? –
-
ప్రగతిభవన్ లో బడ్జెట్ ప్రతిపాదనలపై పై సీఎం కేసీఆర్ సమీక్ష –
-
కోమటిరెడ్డిని టార్గెట్ చేసిన కొండా! రేవంత్ రెడ్డి దెబ్బ మాములుగా లేదుగా… –
-
నేను ఎవరికీ అనుకూలం కాదు.. అధిష్టానం చెప్పింది చేయడమే నా విధి-మాణిక్ రావు ఠాక్రే –
One Comment