
క్రైమ్ మిర్రర్, తెలంగాణ డెస్క్ : మునుగోడులో అధికార పార్టీ నేతలు దుర్మార్గంగా గెలిచారని .. నైతిక విజయం బీజేపీదేనని ఆ పార్టీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్ దేనని విమర్శించారు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనేని చెప్పారు. బ్యాక్ గ్రౌండ్ లేని బ్లాక్ మెయిలర్, చీటర్ రేవంత్ రెడ్డి అని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.తెలంగాణలో మే లో ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు రాజగోపాల్ రెడ్డి. కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికి ఈటెలను పార్టీ నుంచి గెంటేశాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా, మోడీ నాయకత్వంలో దేశంలో, రాష్ట్రంలో బీజేపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Read More : కోమటిరెడ్డిని టార్గెట్ చేసిన కొండా! రేవంత్ రెడ్డి దెబ్బ మాములుగా లేదుగా… –
మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ దుర్మార్గంగా గెలిచిందన్న రాజగోపాల్ రెడ్డి.. ఈ విషయం యావత్ భారతదేశానికి తెలుసునని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, దేశంలో పూర్తిగా బలహీన పడిందని అన్నారు. టీఆర్ఎస్ ను ఓడించేందుకు కాంగ్రెస్ నుండి నాయకులు బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. ఖమ్మం జిల్లా నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీలో చేరేందుకు చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. బీజేపీ ఎదుగుదలను ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన రోజే సీఎం కేసీఆర్ తన బొంద తాను తవ్వుకున్నాడని విమర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఇక నుండి తాను పర్యటిస్తానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
One Comment