
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియాలో ఏం జరుగుతున్నా ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. తమకు ఎదురైన అనుభవాల నుంచి తాము చేస్తున్న రకరకాల పనులకు సంబంధించిన వీడియోలను అప్ లోడ్ చేస్తున్నారు. వీటిని చూసిన నెటిజన్లు వాటిపై స్పందిస్తూ రకరకాల కామెట్స్ పెడుతుంటారు. ఇలా పెట్టిన వీడియోల్లో కొన్ని మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తే కొన్ని భయాందోళన కలిగిస్తాయి. అలాంటి వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణంగా కుక్కపిల్లలు, పిల్లులు, పక్షుల వంటి చిన్న పెంపుడు జంతువులకు దగ్గరకు తీసుకుని ఆహారాన్ని అందిస్తుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం మొసలిని దగ్గరకు తీసుకుని మరీ ఆహారాన్ని అందించడం భయాన్ని కలిగించింది.
Read More : అల్లాపూర్ డివిజన్ లో ఎమ్మెల్యే మాధవరం పర్యటన –
ఈ వీడియోలో ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి మొసలికి ఆహారం తినిపిస్తున్నాడు. అతను మొసలిని తన మోకాళ్ల మధ్య పట్టుకుని మాసం ముక్కను తినిపిస్తున్నాడు. మొసలి అతనిని చూసి దగ్గరకు వస్తుంది. ఆ తర్వాత మొసలిని రెండు కాళ్ల మధ్యలోకి తీసుకుని మాంసం ముక్కను అందిస్తాడు. ఆహారం ఇచ్చిన తర్వాత ఆ మొసలి మళ్లీ నీటిలోకి వెళ్లిపోతుంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు షాకయ్యారు. ట్విట్టర్ లో లాన్స్ అనే యూజర్ పోస్టు చేసిన ఈ వీడియోని కొద్దిసేపటికే 3.9 మిలియన్లకు పైగా చూశారు. 54.3 వేలకు పైగా లైకులు కొట్టారు. అయితే చాలా మంది మొసలి లాంటి ప్రమాదకర జంతువులకు దూరంగా ఉండాలని.. ఏదైనా తేడా జరిగితే ప్రాణాలు పోతాయని హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
-
మహేశ్ బాబు, జూ.ఎన్టీఆర్, విజయ్ ను కలిసేందుకు వచ్చిన బాలీవుడ్ నిర్మాత
-
మావోయిస్టు నేత గాజర్ల రవిపై రూ.10 లక్షల రివార్డు…. మరో ముగ్గురిపై ప్రకటించిన ఎన్‌ఐఏ –
-
విశాఖలో ఏఆర్ కానిస్టేబుల్ దందా.. ప్రేమికుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వైనం !!! –
-
టెక్సాస్ భారతీయ ఆలయంలో దొంగల బీభత్సం ! –
-
ఇతర క్యారెట్ల కంటే బ్లాక్ క్యారెట్ లో బోలెడు పోషకాలు.. అవేంటో తెలుసా? –
One Comment