
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ డెస్క్ : వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొంది. తన తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబానికి దూరం చేశాడని ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి అమృత కాలనీలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లాకి చెందిన ధనలక్ష్మి, శ్రీనివాస్ రెడ్డి దంపతులు. వివాహమై సంతానం కూడా ఉన్న ధనలక్ష్మితో 14 ఏళ్ల కిందట వెంకట రమణమూర్తికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం అదే జిల్లాకు చెందిన వెంకట రమణమూర్తితో వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఇద్దరూ హైదరాబాద్ నగరానికి వచ్చారు. పీర్జాధిగూడ అమృత కాలనీలో భార్యాభర్తలుగా సహ జీవనం చేస్తున్నారు. అప్పటి నుంచి ధనలక్ష్మి కొడుకు శ్రీకాంత్ రెడ్డి (26) తల్లి కోసం వెతుకుతున్నాడు. అయినా తల్లి ఆచూకీ లభించలేదు. నెలరోజుల కిందట ఫేస్ బుక్ ద్వారా తల్లి ధనలక్ష్మి సమాచారం తెలుసుకున్నాడు.
Read More : మహేశ్ బాబు, జూ.ఎన్టీఆర్, విజయ్ ను కలిసేందుకు వచ్చిన బాలీవుడ్ నిర్మాత –
హైదరాబాద్ చేరుకుని తల్లిని ఒప్పించి సొంతూరుకు తీసుకెళ్లాడు కొడుకు శ్రీకాంత్ రెడ్డి. ధనలక్ష్మి వెళ్లిపోయాక వెంకటరమణ మూర్తి ఒంటరిగా మిగిలిపోయాడు. ధనలక్ష్మిని వదిలి ఉండలేకపోతున్నానని పదే పదే శ్రీకాంత్ రెడ్డికి ఫోన్ చేశాడు వెంకటరమణమూర్తి. ధనలక్ష్మిని తిరిగి తన దగ్గరికి పంపించాలని కోరాడు. అయితే ఇందుకు శ్రీనివాసరెడ్డి నిరాకరించాడు. తన తల్లిని తన కుటుంబంతోనే ఉండాలని భావించిన శ్రీకాంత్ రెడ్డి వెంకట రమణ మూర్తి దగ్గరికి హైదరాబాద్ వచ్చాడు. వెంకట రమణమూర్తికి మద్యం తాగించి చిన్న గ్యాస్ సిలిండర్ తో దాడి చేసి కత్తితో పొడిచి హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో నిందితుడు హత్య చేసినట్టు అంగీకరించాడు.
ఇవి కూడా చదవండి …
-
రాముడు, సీతతో కలిసి మధ్యాహ్నమే మద్యం తాగేవాడు! –
-
భట్టి పదవికి రేవంత్ రెడ్డి ఎసరు? –
-
బ్యాక్ గ్రౌండ్ లేని బ్లాక్ మెయిలర్ , చీటర్ రేవంత్ రెడ్డి-రాజగోపాల్ రెడ్డి –
-
కోమటిరెడ్డిని టార్గెట్ చేసిన కొండా! రేవంత్ రెడ్డి దెబ్బ మాములుగా లేదుగా… –
-
మహిళా ఐఏఎస్ అధికారి ఇంట్లోకి చొరబడ్డ డిప్యూటీ తహసిల్దార్.. అరెస్టు చేసిన పోలీసులు –
2 Comments