
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : టెక్సాస్ లోని హిందూ దేవాలయంలో దొంగతనం జరిగింది. ఈ సమాచారం విన్న భారతీయులు షాక్ కు గురయ్యారు. ఆలయంలోకి చొరబడ్డ దొంగలు స్వామివారికి సమర్పించే హుుండీ ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఘటన బ్రెజోస్ వ్యాలీలోని శ్రీ ఓంకార్ నాథ్ ఆలయంలో జరిగింది. బ్రె జోస్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఈ విషయంపై దర్యాప్తు చేస్తోంది. కిటికీలోంచి ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు ఆలయంలోని విలువైన వస్తువులను భద్రపరిచే బాక్స్ తో పాటు హుండీని ఎత్తుకెళ్లారని ఆలయ బోర్డు సభ్యుడు తెలిపాడు.
Read More : మావోయిస్టు నేత గాజర్ల రవిపై రూ.10 లక్షల రివార్డు…. మరో ముగ్గురిపై ప్రకటించిన ఎన్‌ఐఏ –
దొంగలు ఆలయంలోకి వెళ్లి విరాళాల పెట్టెను ఎలా బయటకు తీశాడు అనే వీడియో అక్కడి భారతీయులను కలవరపరిచింది. ఇది గోప్యతపై దాడి చేసినట్లుగా వారు భావిస్తున్నారు. ఆలయం వెనుక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న పూజారి , అతని భార్య క్షేమంగా ఉన్నారని చెప్పారు. అమెరికాలోని హిందూప్యాక్ట్ అనే అడ్వకేసీ కలెక్టివ్ సమగ్ర విచారణ చేపట్టాలని ఎఫ్ బీఐని కోరింది. ఇదిలా ఉండగా, దేవాలయాల వద్ద వరుస విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నందున అమెరికాలోని దేవాలయాలకు భద్రతను పెంచాలని హిందూ అమెరికన్ ఫౌండేషన్ డిమాండ్ చేసింది.
ఇవి కూడా చదవండి :
-
చైనాలో కరోనా విజృంభణ.. ఇప్పటికే 80 శాతం మందికి వైరస్
-
తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని హత్య చేసిన కొడుకు
-
మహేశ్ బాబు, జూ.ఎన్టీఆర్, విజయ్ ను కలిసేందుకు వచ్చిన బాలీవుడ్ నిర్మాత
-
మహిళా ఐఏఎస్ అధికారి ఇంట్లోకి చొరబడ్డ డిప్యూటీ తహసిల్దార్.. అరెస్టు చేసిన పోలీసులు
-
బ్యాక్ గ్రౌండ్ లేని బ్లాక్ మెయిలర్ , చీటర్ రేవంత్ రెడ్డి-రాజగోపాల్ రెడ్డి
2 Comments