
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ : కరోనా పుట్టినిల్లు చైనాలో మహమ్మారి విజృభిస్తోంది. ప్రపంచం ఎప్పుడూ చూడని విధంగా డ్రాగన్ దేశంలో వైరస్ కేసులు నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్ 7 ధాటికి అక్కడి ప్రజలు విలవిలలాడుతున్నారు. ఇప్పటికే చైనాలో 80శాతం మంది ప్రజలు వైరస్ బారిన పడినట్టు సమాచారం. రానున్న మూడు నెలల్లో అతిపెద్ద కోవిడ్ వేవ్ వచ్చే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాలో న్యూఇయర్ కావడంతో జనం పెద్ద సంఖ్యలో స్వస్థలాలకు వెళ్తున్నారు. దీంతో వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. ప్రజలు మాస్ మూమెంట్ వల్ల వైరస్ విస్తరిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీంతో సమీప కాలంలో సెకండ్ వేవ్ వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు.
Read More : తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని హత్య చేసిన కొడుకు –
దేశంలో న్యూ ఇయర్ వల్ల గ్రామాల్లో కూడా వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఆ సమయంలో కొవిడ్ రోగుల సంఖ్య గరిష్ట స్థాయిని దాటుతుందని అంచనా వేస్తున్నారు. చైనాలో జీరో కొవిడ్ విధానాన్ని ఎత్తివేయడంతో మహమ్మారి దావానంలా వ్యాప్తి చెందుతోంది. ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోయాయి. మరణాలు కూడా పెరగడంతో శ్మశనాల దగ్గర శవాలతో బంధువులు బారులు తీరారు. జీరో కొవిడ్ ఎత్తివేసిన నెలలో జనవరి 12 వరకు 60వేల మంది మరణించారు. అయితే ఈ మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
3 Comments