
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద సమస్య బహిరంగ మూత్ర విసర్జన. జనావాస ప్రాంతాల్లో కొందరు బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తూ ఇబ్బందులు పెడుతుంటారు. ఈ సమస్య భారత్ లోనూ తరచూ చూస్తుంటాం. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు అనేక దేశాల్లో టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చారు. అయినా కొందరు తీరు మార్చుకోకుండా బహిరంగ మూత్ర విసర్జన చేస్తూనే ఉన్నారు. దీంతో దుర్గంధం వెదజల్లుతూ ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుంది. రెయింబవళ్లు రద్దీగా ఉండే ప్రసిద్ధి చెందిన సెంట్రల్ లండన్ జిల్లా బహిరంగ మూత్రవిసర్జనను నిరోధించడానికి కొత్త పరిష్కారాన్ని అమలు చేస్తోంది.
Read Also : రాజమౌళికి జేమ్స్ కేమరూన్ బంపరాఫర్….
స్థానికుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన వెస్ట్ మినిస్టర్ సిటీ కౌన్సిల్ ఆ ప్రాంతంలోని గోడలపై యాంటీ పీ పెయింట్‌ను వాడుతోంది. పెయింట్ అనేది ఒక ప్రత్యేకమైన స్ప్రే-ఆన్ కెమికల్, ఇది నీటి-వికర్షక అవరోధాన్ని సృష్టిస్తుంది. కొట్టినప్పుడు మూత్రాన్ని తిరిగి పిచికారీ చేస్తుంది. ఆ ప్రాంతాన్ని ఉల్లంఘించిన వారికి షాక్‌గా పనిచేస్తుంది. సాహోలోని చాలా ప్రాంతాల్లో మద్యం విక్రయ షాపులు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 24 గంటలూ నడిచే బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లతో పాటు నివాస ప్రాంతాలూ ఉన్నాయి. సరిపడా టాయిలెట్స్ లేకపోవడంతో జనం రోడ్డు మీదే మూత్ర విసర్జన చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం దుర్గంధభరితంగా మారింది. ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి లండన్ యంత్రాంగం ఏటా రూ.10.26 కోట్లు వెచ్చించాల్సి వస్తుంది.
Also Read : జీవో నెంబర్ 317 అనైతికమని వ్యాఖ్య… కేసీఆర్ ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్
అయినా సమస్య పరిష్కారం కావడం లేదు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు వెస్ట్ మినిస్టర్ సిటీ కౌన్సిల్ కొత్త పరిష్కార మార్గంతో ముందుకు వచ్చింది. వాటర్ రిపెల్లెంట్ రసాయనాన్ని గోడలపై స్ప్రే చేయిస్తోంది. ఎవరైనా మూత్రం గోడలపై పోస్తే వెంటనే అది తిరిగి మూత్రం పోసే వ్యక్తిపైనే చింది పడుతుంది. ముందు సాహో ప్రాంతంలోని సమస్య తీవ్రంగా ఉన్న ప్రదేశంలో ఈ తరహా ద్రావకాన్ని స్ప్రే చేయించారు. తర్వాత నెమ్మదిగా మిగతా ప్రాంతల్లోనూ ప్రయోగిస్తారు. ఇప్పటికే ఈ ప్రయోగాన్ని జర్మనీలో ప్రయోగించి మంచి ఫలితాలు సాధించారు. ఇప్పుడు ఈ ప్రయోగం ద్వారా లండన్ లోనూ సమస్యకు చెక్ పెట్టవచ్చని అక్కడి యంత్రాంగం భావిస్తోంది.
ఇవి కూడా చదవండి :
- హైదరాబాద్ పాతబస్తీలో రెచ్చిపోతున్న రౌడీషీటర్లు..
- పాలమూరు వేదికగా బీజేపీ బడా స్కెచ్.. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో ఎన్నికల రోడ్ మ్యాప్!!
- రేపు పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటన… భారీగా ఏర్పాట్లు చేస్తున్న జనసేన నేతలు
- నల్గొండ బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు… మంత్రి సమక్షంలో ఫైర్ అయిన ఎమ్మెల్యే చిరుమర్తి
- ‘టీడీపీ-జనసేన పొత్తు.. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి’.. కుండబద్దలు కొట్టిన మాజీ మంత్రి
One Comment