
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : క్యారెట్ అనగానే మనకు గుర్తొచ్చేది ఎర్ర రంగులో ఉన్న కూరగాయ. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తాయని అందరికీ తెలుసు. ముఖ్యంగా కంటికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతారు. కానీ క్యారెట్ ఒక్క ఎరుపురంగు మాత్రమే కాదు.. పసుపు , ఆరెంజ్, బ్లాక్ క్యారెట్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో బ్లాక్ క్యారెట్లలో ఇతర క్యారెట్లలో లభించే పోషకాల కంటే ఎక్కువగా ఉంటాయి. నల్లగా ఉండే క్యారెట్లలో క్యాన్సర్ కణాలను నాశనం చేసే శక్తి ఉంది. ఇందులో ఉండే ఆంథోసైనిన్ కెమికల్స్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తాయి. బ్లాక్ క్యారెట్ లో ఉండే అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఈ క్యారెట్లు శరీరంలోకి కార్సినోజెనిక్ కణాల ప్రవేశాన్ని నిరోధిస్తాయి.
Read More : టెక్సాస్ భారతీయ ఆలయంలో దొంగల బీభత్సం ! –
బ్లాక్ క్యారెట్లు చలికాలంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో కొవ్వు పెరగకుండా బ్లాక్ క్యారెట్ కాపాడుతుంది. అలాగే బ్లాక్ క్యారెట్ లోని ఐరన్ కంటి చూపును పెంచుతుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. బ్లాక్ క్యారెట్ తినడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బ్లాక్ క్యారెట్ శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.. అందుకే దీన్ని శీతాకాలంలో కూడా తినవచ్చు. బ్లాక్ క్యారెట్ రక్తంలోని మలినాలు తొలగించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. బ్లాక్ క్యారెట్ తెల్లరక్తకణాలను పెంచడంలో సాయపడుతుంది. అంతే కాకుండా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అదే విధంగా మలబద్దకం, గ్యాస్, ఉబ్బరం, గుండెలో మంట, విరోచనాలు వంటి సమస్యలను దూరం చేస్తుంది. బ్లాక్ క్యారెట్లను తరచుగా తినడం వల్ల అల్జీమర్స్ సమస్య నుంచి గట్టెక్కవచ్చు.
ఇవి కూడా చదవండి :
-
చైనాలో కరోనా విజృంభణ.. ఇప్పటికే 80 శాతం మందికి వైరస్
-
తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని హత్య చేసిన కొడుకు
-
మహేశ్ బాబు, జూ.ఎన్టీఆర్, విజయ్ ను కలిసేందుకు వచ్చిన బాలీవుడ్ నిర్మాత
-
మావోయిస్టు నేత గాజర్ల రవిపై రూ.10 లక్షల రివార్డు…. మరో ముగ్గురిపై ప్రకటించిన ఎన్‌ఐఏ –
-
బ్యాక్ గ్రౌండ్ లేని బ్లాక్ మెయిలర్ , చీటర్ రేవంత్ రెడ్డి-రాజగోపాల్ రెడ్డి
2 Comments