
కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అల్లాపూర్ డివిజన్ లో పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ సబిహా గౌసొద్దీన్ తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. వివేకానంద నగర్ రోడ్డు నెంబర్ 9లో మస్తాన్ రెడ్డి ఇంటి దగ్గర 72 లక్షల రూపాయలతో చేపట్టిన సిసి రోడ్డు లేయింగ్ పనులను ప్రారంభించారు. తులసి నగర్ టెంపుల్, గాయత్రీ నగర్ లైబ్రరీ పార్క్ దగ్గర కొత్త సీసీ రోడ్లు వేయనున్నారు. న్యూ అల్లాపూర్ చిల్ల దగ్గర, శివాజీ నగర్ టెంపుల్ దగ్గర, కె ఎస్ నగర్ ప్రభుత్వ స్కూల్ దగ్గర నిర్మించనున్న సీసీ రోడ్లకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు భూమి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అల్లాపూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఐలయ్య, ప్రధాన కార్యదర్శి పిల్లి తిరుపతి, కో ఆర్జీనేటర్ వీరారెడ్డి, బీఆర్ఎస్ అల్లాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ మస్తాన్ రెడ్డి, వీవీ నగర్ నాయకులు పాల్గొన్నారు. తమ కాలనీకి వచ్చిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు బుక్స్ బహుకరించారు మస్తాన్ రెడ్డి.
One Comment