
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : నరసరావుపేటలో అదృశ్యమైన ఏడాది వయసున్న చిన్నారి కథ విషాదాంతంగా ముగిసింది. బాలుడి మృతదేహం బావిలో కనిపించింది. చిన్నారి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన గంటల వ్యవధిలోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు. పోలీసుల దర్యాప్తులో వేరే కోణం బయటపడింది. నరసరావుపేట రూరల్ పరిధిలోని స్థానిక బ్యాంక్ కాలనీకి చెందిన బండి వాసు, సాయిలక్ష్మి దంపతులకు ఐదేళ్ల కూతురు మోక్ష, కొడుకు భాను ప్రకాశ్ ఉన్నారు. కొడుకును తల్లి బావి పిట్టగోడపై కూర్చోబెట్టి, ఆడిస్తుండగా జారి బావిలో పడిపోయాడు. కళ్లముందే పిల్లాడు పడిపోవడంతో షాక్ కు గురైన తల్లి బాలుడు కనిపించడం లేదని కుటుంబ సభ్యులతో చెప్పింది.
Read More : విశాఖలో ఏఆర్ కానిస్టేబుల్ దందా.. ప్రేమికుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వైనం !!! –
ఇంటి దగ్గర ఆడుకుంటున్న సమయంలో పిల్లాడు కనిపించకుండా పోయాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో వెతికినా బాలుడి ఆచూకీ తెలియలేదు. దీంతో డీఎస్పీ విజయ్ భాస్కరరావు ఘటనాస్థలికి చేరుకున్నారు. చిన్నారి మిస్ అయిన ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానిక పరిసరాల్లో ఉన్న సీసీ టీవీని పరిశీలించగా అసలు విషయం బయటపడింది. బాబుని బావి గోడ మీద కూర్చోబెట్టి ఆడిస్తుండగా ప్రమాదవశాత్తూ జారిపడిపోయినట్టు తేలింది.
Read More : ఇతర క్యారెట్ల కంటే బ్లాక్ క్యారెట్ లో బోలెడు పోషకాలు.. అవేంటో తెలుసా? –
ఇవి కూడా చదవండి :
-
చైనాలో కరోనా విజృంభణ.. ఇప్పటికే 80 శాతం మందికి వైరస్
-
మహేశ్ బాబు, జూ.ఎన్టీఆర్, విజయ్ ను కలిసేందుకు వచ్చిన బాలీవుడ్ నిర్మాత
-
మావోయిస్టు నేత గాజర్ల రవిపై రూ.10 లక్షల రివార్డు…. మరో ముగ్గురిపై ప్రకటించిన ఎన్‌ఐఏ –
-
బ్యాక్ గ్రౌండ్ లేని బ్లాక్ మెయిలర్ , చీటర్ రేవంత్ రెడ్డి-రాజగోపాల్ రెడ్డి
-
టెక్సాస్ భారతీయ ఆలయంలో దొంగల బీభత్సం ! –
One Comment