
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ : బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కు అక్కడి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. కారులో ప్రయాణిస్తూ సీటు బెల్ట్ పెట్టుకోనందుకు రిషి సునాక్ కు వంద పౌండ్ల మేరకు జరిమానా వేశారు. ఒక చిన్న వీడియో చిత్రీకరణ కోసం రిషి సునాక్ కాసేపు సీటు బెల్ట్ తీసేశారు. ఇదే వివాదానికి కారణమైంది. ఈ సంఘటన బ్రిటన్ లో దుమారం రేపింది. దీంతో సీటు బెల్ట్ పెట్టుకోనందుకు రిషి సునాక్ క్షమాపణలు చెప్పారు.
Read More : సికింద్రాబాద్ అగ్నిప్రమాద జరిగిన భవనంలో అస్థిపంజరం గుర్తింపు ! ! ! –
దేశవ్యాప్తంగా వంద ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే వీడియో కోసం కొన్ని నిమిషాల పాటు సీటు బెల్ట్ పక్కన పెట్టినట్లు రిషి సునాక్ వివరణ ఇచ్చారు. అయితే రిషి సునాక్ వివరణ పై లేబర్ పార్టీ నేతలు విమర్శలు చేశారు. సీటు బెల్ట్ కు ఆర్థిక వ్యవస్థకు రిషి సునాక్ ముడిపెట్టారని లేబర్ పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. ప్రధాని అయి ఉండి నిబంధనలు ఉల్లంఘించారంటూ నెటిజన్లు సైతం విమర్శించారు. దీంతో రిషీ సునాక్ బ్రిటన్ క్షమాపణలు చెప్పారు.
More Read : నేను ఎవరికీ అనుకూలం కాదు.. అధిష్టానం చెప్పింది చేయడమే నా విధి-మాణిక్ రావు ఠాక్రే –
సీటు బెల్టు పెట్టుకోకుండా ప్రయాణించడం తప్పేనని అంగీకరించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సీటు బెల్టు పెట్టుకోవాలని కోరారు. బ్రిటన్ లో చట్టాల ప్రకారం కారులో ప్రయాణించే సమయంలో ప్రతి ఒక్కరూ సీటు బెల్టు పెట్టుకోవాల్సిందే. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే. కారు ప్రయాణీకులు సీటు బెల్ట్ పెట్టుకోకపోతే వంద పౌండ్ల జరిమానా విధిస్తారు. అదే సదరు కేసు కోర్టు వరకు వెళితే 500 పౌండ్ల వరకు జరిమానా పెరిగే అవకాశాలున్నాయి.
ఇవి కూడా చదవండి …
-
ఒక్కటైన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి –
-
విశాఖ బ్రాండిక్స్‌పై ఎన్జీటీ కొరడా…కార్మికులు రూ.లక్ష పరిహారం –
-
నాగర్ కర్నూల్ జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత.. బీజేపీ నేతపై బీఆర్ఎస్ నేతల దాడి –
-
లక్డీకపూల్ లో ఉపాధ్యాయ దంపతుల మౌనదీక్ష.. చిన్నారులను కూడా అరెస్టు చేసిన పోలీసులు –
-
2021లో 611 టన్నుల బంగారం కొనుగోలు చేసిన భారతీయులు –
2 Comments