
క్రైమ్ మిర్రర్, సిటి డెస్క్ : సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ లోని డెక్కన్ స్పోర్ట్స్ నిట్ వేర్ మాల్ లో మంటలు చెలరేగి అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో నలుగురిని ఫైర్ సిబ్బంది రక్షించగా .. మరో ముగ్గురి ఆచూకీ లభించలేదు. నిన్నటి నుంచి వారి కోసం ఫైర్ సిబ్బంది గాలిస్తున్నారు. వారి సెల్ ఫోన్ లోకేషన్ మంటలు చెలరేగిన భవనంలోనే చూపిస్తుండటంతో వారు సజీవదహనమై ఉంటారని అనుమానిస్తున్నారు. 22 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పివేశారు. అయినా భవనంలో వేడి ధాటికి లోపలికి వెళ్లలేకపోతున్నారు. వేడి తీవ్రత ఎక్కువగా ఉండటంతో మాల్ లోపలికి వెళ్లలేని పరిస్థితి. దీంతో డ్రోన్ కెమెరాల ద్వారా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. భవనం లోపల రెండో అంతస్తులో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న రెండు డెడ్ బాడీస్ ను గుర్తించినట్టు తెలుస్తోంది.
Read More : 2021లో 611 టన్నుల బంగారం కొనుగోలు చేసిన భారతీయులు –
భవనం లోపలి పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు. డ్రోన్ కెమెరా సాయంతో సమాచారాన్ని సేకరిస్తున్నామని కలెక్టర్ అమోయ్ కుమార్ చెప్పారు. భవనం లోపల ఇంకా వేడిగా ఉందని, ఇప్పటికీ భవనంలోకి వెళ్లలేని పరిస్థితి ఉందని చెప్పారు. మరోవైపు అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదని విద్యుత్ అధికారి శ్రీధర్ తెలిపారు. భవనంలో మంటలు వ్యాపిస్తున్న సమయంలో మీటర్లలో విద్యుత్ సరఫరా ఉందని చెప్పారు. ఒక వేళ షార్ట్ సర్క్యూట్ అయి ఉంటే సబ్ స్టేషన్ లో ట్రిప్ అయ్యేదని వివరించారు. నిన్న ఉదయం 11.20 గంటల కు ఫోన్ రాగానే విద్యుత్ సరఫరా నిలిపివేశామని.. చుట్టుపక్కల కాలనీలకు సాయంత్రం 6.30 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని తెలిపారు.
One Comment