
క్రైమ్ మిర్రర్, తెలంగాణ డెస్క్ : సికింద్రాబాద్ నల్లగుట్టలో జరిగిన అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ప్రమాదం జరిగిన రోజున అక్కడ పనిచేసే ముగ్గురు కార్మికులు కనిపించకుండా పోయారు. ఐడీ కార్డులు తెచ్చుకుంటామని చెప్పి ముగ్గురు వెళ్లారని తోటి కూలీలు అధికారులకు చెప్పారు. రెండు రోజులుగా వారి ఆచూకీ తెలియకపోవడంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. తాజాగా భవనం మొదటి అంతస్తు వెనుకభాగంలో ఒక వ్యక్తి అస్థిపంజరాన్ని గుర్తించారు అధికారులు.
Read More : నేను ఎవరికీ అనుకూలం కాదు.. అధిష్టానం చెప్పింది చేయడమే నా విధి-మాణిక్ రావు ఠాక్రే –
భవనం మొదటి అంతస్తులో శిథిలాలు తొలగించే క్రమంలో మృతదేహం అవశేషాల్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం అవశేషాల్ని మూటలో చుట్టి గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతదేహం ఎవరిదని గుర్తించే వీలు లేకపోవడంతో డిఎన్ఏ పరీక్ష చేయనున్నారు. అగ్ని ప్రమాదంలో ఆచూకీ లేకుండా పోయిన ముగ్గురు వ్యక్తులు వసీం, జహీర్, జునేద్ అగ్ని ప్రమాదంలో మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురి కుటుంబ సభ్యుల డీఎన్ఏ సేకరించి మృతదేహం డీఎన్ఏతో సరిపోల్చుకోనున్నారు.
More Read : లక్డీకపూల్ లో ఉపాధ్యాయ దంపతుల మౌనదీక్ష.. చిన్నారులను కూడా అరెస్టు చేసిన పోలీసులు –
అంతకుముందు మంత్రి తలసాని ఘటనాస్థలిని పరిశీలించారు. బస్తీవాసులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదంతో కంటి మీద కునుకులేకుండా పోయిందని బస్తీ వాసులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని భవనాన్ని కూల్చేస్తామని స్థానికులకు తలసాని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై ఫైరయ్యారు. కిషన్ రెడ్డి లేనిపోని కామెంట్లు చేస్తే బాధ కలుగుతుందని చెప్పారు. అగ్ని ప్రమాద ఘటనలో అధికార యంత్రాంగం మొత్తం యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టిందని అన్నారు. ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు ప్రజలకు భరోసా కల్పించాల్సిన రాజకీయ నాయకులు విమర్శలు చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు.
Read More : 2021లో 611 టన్నుల బంగారం కొనుగోలు చేసిన భారతీయులు –
త్వరలో జరగనున్న ఉన్నత స్థాయి సమావేశంలో ఈ తరహా భవనాలన్నిటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తలసాని చెప్పారు. నిబంధనలు, అనుమతులు పాటించని భవనాలను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. డెక్కన్ స్పోర్ట్స్ భవన సముదాయం ఐదు అంతస్తులు, పెంట్ హౌస్ తో ఉన్న భవనాన్ని ప్రత్యేక టెక్నాలజీతో కూల్చివేస్తామని వెల్లడించారు. ఈ తరహా టెక్నాలజీ గతంలో మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలో వినియోగించామని మంత్రి తలసాని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి …
-
ఒక్కటైన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి –
-
దొంగగా మారిన టీచర్.. సంగారెడ్డి జిల్లాలో అరెస్ట్ –
-
సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం.. డ్రోన్ కెమెరాతో సెర్చింగ్.. ముగ్గురు సజీవదహనం ! –
-
విశాఖ బ్రాండిక్స్‌పై ఎన్జీటీ కొరడా…కార్మికులు రూ.లక్ష పరిహారం –
-
నాగర్ కర్నూల్ జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత.. బీజేపీ నేతపై బీఆర్ఎస్ నేతల దాడి –
2 Comments