Andhra Pradesh

విశాఖ బ్రాండిక్స్‌పై ఎన్జీటీ కొరడా…కార్మికులు రూ.లక్ష పరిహారం

క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ డెస్క్ : విశాఖ బ్రాండిక్స్‌ సెజ్‌లో గ్యాస్‌ లీక్‌ ఘటనపై ఎన్జీటీ కొరడా ఝళిపించింది. విషవాయువుల కారణంగా అస్వస్థతకు గురైన 530 మంది మహిళా కార్మికులకు లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ పునరుద్ధరణకు మరో రూ.10 కోట్లు కాలుష్య నియంత్రణ మండలికి అదనంగా జమచేయాలని ఆదేశించింది. 3 నెలల్లో పరిహారం అందజేస్తూ, 6 నెలల్లో ఆదేశాలు అమలు చేయాలని ఆదేశించింది. సెజ్‌లో గ్యాస్‌ లీకేజీని సుమోటోగా స్వీకరించింది ఎన్జీటీ.

Read More : నాగర్ కర్నూల్ జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత.. బీజేపీ నేతపై బీఆర్ఎస్‌ నేతల దాడి –

గత ఏడాది జూన్‌ 3న అచ్యుతాపురం సెజ్‌ బ్రాడిక్స్‌ సెపరెల్‌ పార్క్‌ లో సీడ్స్ దుస్తుల తయారీ పరిశ్రమలో విషవాయువు లీకైంది. మహిళా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ ఘటనతో అప్రమత్తమైన యాజమాన్యం ఆధునిక సాంకేతిక వ్యవస్థను సీడ్స్‌ కంపెనీతో తో పాటు బ్రాండిక్స్‌ లో ఏర్పాటు చేశారు. అయినా గ్యాస్‌ లీకై మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. పదే పదే ముప్పు వెంటాడుతున్నా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటి ప్రమాదంపై తాజాగా ఎన్జీటీ ఈ ఆదేశాలు జారీ చేసింది.

ad 728x120 SRI swami - Crime Mirror
ఇవి కూడా చదవండి …
  1. ఒక్కటైన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి – 
  2. దొంగగా మారిన టీచర్.. సంగారెడ్డి జిల్లాలో అరెస్ట్ –
  3. 20 రోజుల వ్యవధిలో రవితేజ తలరాత మారింది ! –
  4. కన్నబిడ్డను చంపి కదులుతున్న రైల్లోంచి నదిలోకి తోసేసిన కసాయి తల్లి ! –
  5. ఎన్టీఆర్ గొప్పతనం గురించి మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు ! –

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.