
క్రైమ్ మిర్రర్, తెలంగాణ డెస్క్ : హైదరాబాద్ లక్డీకపూల్ లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట చేపట్టిన ఉపాధ్యాయ దంపతుల మౌనదీక్ష ఉద్రిక్తతకు దారి తీసింది. 13 జిల్లాల్లో బదిలీల కోసం ఉపాధ్యాయ దంపతులు చేపట్టిన మౌన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ దీక్షలో ఉద్యోగుల తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా పాల్గొన్నారు. తల్లిదండ్రులతో పాటు పిల్లలను కూడా అరెస్టు చేయడం విమర్శలకు తావిచ్చింది. సంవత్సరకాలంగా 13 జిల్లాల్లో ఉపాధ్యాయ దంపతుల బదిలీల కోసం స్పౌజ్ ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు.
Read More : సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం.. డ్రోన్ కెమెరాతో సెర్చింగ్.. ముగ్గురు సజీవదహనం ! –
13 నెలలు నిరీక్షిస్తూ నరకం అనుభవిస్తున్న ఉపాధ్యాయ దంపతులు శనివారం కమిషనర్ కార్యాలయం ముందు మౌనదీక్ష చేపట్టారు. వందలాదిగా తరలివచ్చిన ఉపాధ్యాయులు మౌనంగా తమ బాధను ప్రభుత్వానికి వివరించాలని ప్రయత్నించారు. అయితే కమిషనర్ కార్యాలయానికి వస్తున్న స్పౌజ్ టీచర్లను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. దంపతుల బదిలీలను బ్లాక్ చేసిన 13 జిల్లాల్లో 2100 మంది బాధితులు ఉండగా, అందులో 615 మందికి మాత్రమే స్పౌజ్ బదిలీలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అది కూడా కేవలం కొద్ది మంది స్కూల్ అసిస్టెంట్లకు మాత్రమే అనుమతించారు. ఎస్జీటీ, పండిట్, పీఈటీ ఇతర ఉపాధ్యాయ దంపతుల బదిలీలు జరగడం లేదని విస్తృత ప్రచారం జరుగుతుంది.
More Read : 2021లో 611 టన్నుల బంగారం కొనుగోలు చేసిన భారతీయులు –
అసలు ఏం జరుగుతుందో తెలియక ఉపాధ్యాయ దంపతులు డీఎస్సీ కార్యాలయం ముందు మౌనదీక్ష చేపట్టారు. వందలాదిగా తరలివచ్చిన ఉపాధ్యాయ కుటుంబాలు..మౌనంగా తమ ఆవేదనను ప్రభుత్వానికి వివరించే ప్రయత్నం చేశారు. గడిచిన సంవత్సరంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని, ప్రతిస్పౌస్ బాధితుడికి న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.13 జిల్లాల్లో ఉపాధ్యాయ దంపతులకు బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయులు వేడుకున్నారు. అందరికీ అవకాశం ఉన్నప్పటికి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, సీఎం కేసీఆర్ కలగజేసుకొని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
One Comment